జగన్ కు భారతి స్ట్రోక్ తగలబోతోంది: గోనె ప్రకాశరావు
- అన్ని సర్వేలు కూటమే గెలుస్తుందని చెపుతున్నాయన్న గోనె
- ఏపీ బాగుపడాలంటే చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని వ్యాఖ్య
- జగన్ కు ప్రజలు బుద్ధి చెపుతారన్న గోనె
జగన్ సీఎం అయిన తర్వాత ఏపీ అభివృద్ధి కుంటుపడిందని తెలంగాణ నేత, మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు అన్నారు. ఏపీ మళ్లీ బాగు పడాలంటే చంద్రబాబు సీఎం కావాల్సిందేనని చెప్పారు. అన్ని సర్వేలు కూటమే గెలుస్తుందని చెపుతున్నాయని అన్నారు. సెంట్రల్, స్టేట్ ఇంటెలిజెన్స్ సర్వేలతో పాటు జగన్ సర్వేలు కూడా కూటమిదే గెలుపని స్పష్టం చేశాయని తెలిపారు. 120 నుంచి 140 అసెంబ్లీ స్థానాలు, 19 నుంచి 21 ఎంపీ స్థానాలను కూటమి గెలుచుకుంటుందని చెప్పారు. ప్రతీ జిల్లాలో కూటమి ప్రభంజనాన్ని చూస్తారని అన్నారు.
ఒక టీవీ ఛానల్ కు జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అని గోనె ప్రకాశ్ రావు విమర్శించారు. ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నలు, వాటికి జగన్ చెప్పిన సమాధానాలను చూస్తే ఈ విషయం అర్థమవుతుందని చెప్పారు. తల్లికి, చెల్లికి న్యాయం చేయలేని జగన్... రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తాడని ప్రశ్నించారు. జగన్ ను సోనియాగాంధీ, కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోలేదని చెప్పారు.
ఒక్క ఛాన్స్ అని ఇస్తే... ఐదేళ్లలో అరాచక పాలనను చూపించారని గోనె ప్రకాశ్ రావు దుయ్యబట్టారు. జగన్ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిందని అన్నారు. జగన్ కు ఆయన భార్య భారతి స్ట్రోక్ తగలబోతోందని చెప్పారు. జగన్ కు భారతి సిమెంట్, సాక్షి టీవీ, సాక్షి పేపర్ ఎలా వచ్చాయని ప్రశ్నించారు. జగన్ డ్రామాలను ప్రజలు తెలుసుకున్నారని... ఆయనకు బుద్ధి చెప్పేందుకు జనాలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు.