ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు జ‌మ‌పై ఈసీ ఆంక్ష‌లు

  • పోలింగ్ త‌ర్వాతే న‌గ‌దు బ‌దిలీ చేయాల‌ని ఆదేశం
  • ఇప్ప‌టికే బ‌ట‌న్ నొక్కిన ప‌థ‌కాల న‌గ‌దు జ‌మ‌ను ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు వాయిదా 
  • మే 13న పోలింగ్ ముగిసిన త‌ర్వాత డ‌బ్బు జ‌మ చేసేలా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తామ‌న్న‌ ఈసీ
ఏపీలో సంక్షేమ ప‌థ‌కాల న‌గ‌దు బ‌దిలీపై ఎన్నిక‌ల సంఘం ఆంక్ష‌లు విధించింది. పోలింగ్ త‌ర్వాతే న‌గ‌దు జ‌మ చేయాల‌ని ఆదేశించింది. ఇప్ప‌టికే బ‌ట‌న్ నొక్కిన ప‌థ‌కాల డ‌బ్బు జ‌మ‌ను ఎన్నిక‌ల‌య్యే వ‌ర‌కు వాయిదా వేసింది. మే 13వ తేదీన పోలింగ్ ముగిసిన త‌ర్వాత డ‌బ్బు జ‌మ చేసేలా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేస్తామ‌ని ఈసీ పేర్కొంది. కాగా, ఎల‌క్ష‌న్ కోడ్ కంటే ముందే వివిధ ప‌థ‌కాల కోసం జ‌గ‌న్ బ‌ట‌న్ నొక్కారు. అయితే, ఎన్నిక‌లు ముగిసిన త‌ర్వాతే ల‌బ్ధిదారుల‌కు న‌గ‌దు జ‌మ చేయాల‌ని ఈసీ ఆదేశించ‌డం జ‌రిగింది.


More Telugu News