రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ ల దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పికొడతారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
- రిజర్వేషన్లను రద్దు చేయదనే వాస్తవాన్ని ప్రజలు గుర్తించారన్న కిషన్ రెడ్డి
- తెలంగాణలో బీజేపీ అత్యధిక స్థానాలను గెలుకుంటుందని ధీమా
- ఎన్నికలు వస్తాయని తెలిసినా కాంగ్రెస్ ముందే ఎందుకు రైతుబంధు ఇవ్వలేకపోయిందని ప్రశ్న
రిజర్వేషన్లకు సంబంధించి తమ పార్టీపై కాంగ్రెస్, బీఆర్ ఎస్ లు చేస్తున్న దుష్ప్రచారాన్ని ప్రజలే తిప్పి కొడతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. వాస్తవాలను ప్రజలు గుర్తించి తమకు మద్దతు పలుకుతున్నారని ఆయన చెప్పారు. వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన ప్రధాని మోదీ దేశంలో రిజర్వేషన్లను తొలగించరనే నమ్మకం ప్రజలకుందని, అందుకే తమ పార్టీ భారీ మెజారిటీకి బాటలు వేస్తున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కిషన్ రెడ్డి హైదరాబాద్ లో ని నాంపల్లి, గుడిమల్కాపూర్, మెహిదీపట్నం, ఆసిఫ్ నగర్ ప్రాంతాల్లో నిర్వహించిన రోడ్ షోలకు జనం భారీగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మాట్లాడుతూ...ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్నికలు వస్తాయని తెలిసినా ముందే ఎందుకు రైతుబంధు ఇవ్వలేదని ప్రశ్నించారు.
ఇప్పటివరకు తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ లకు రాని విధంగా బీజేపీకి అత్యధిక స్థానాలను కట్టబెట్టాలని ప్రజలు ఇప్పటికే నిర్ణయించుకున్నారని కిషన్ రెడ్డి తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో రాష్ట్రం నుంచి బీజేపీకి అత్యధిక స్థానాలను గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు. మోదీ ప్రధానిగా ఉంటే మన దేశం జోలికి ఎవ్వరూ రాలేరని కిషన్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ప్రధాని మోదీ హవా ఉందన్నారు.