ఫోన్ ట్యాపింగ్ కేసులో తొలిసారి స్పందించిన ప్రధాన నిందితుడు ప్రభాకర్ రావు

  • కేసీఆర్ కులం, తన కులం ఒకటే కావడంతో ఈ కేసులో తనను నిందిస్తున్నారని ఆరోపణ
  • తాను ఎలాంటి తప్పు చేయలేదని కోర్టుకు తెలిపిన ప్రభాకర్ రావు
  • కారణం లేకుండానే తనను బదిలీ చేశారని... చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారని వెల్లడి
  • అమెరికాలో క్యాన్సర్ చికిత్స అనంతరం తాను భారత్ కు వస్తానని వెల్లడి
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు తొలిసారి స్పందించారు. కేసీఆర్ కులం, తన కులం ఒకటే కావడంతో ఈ కేసులో తనను నిందిస్తున్నారని ఆరోపించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు ప్రధాన నిందితుడిగా ఉన్నారు. ఆయనకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేసే అంశంపై కోర్టులో బుధవారం వాదనలు జరిగాయి. ఈ మేరకు ఆయన తన వాదనలను అఫిడవిట్ ద్వారా వివరించారు.

తాను ఉన్నతాధికారుల పర్యవేక్షణలో పని చేస్తానని చెప్పారు. అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్ చీఫ్‌ల పర్యవేక్షణలో పని చేసినట్లు తెలిపారు. తనపై ఎప్పటికప్పుడు ఉన్నతాధికారుల సమీక్ష ఉంటుందన్నారు. తాను ఎలాంటి తప్పు చేయలేదన్నారు. కారణం లేకుండానే తనను నల్గొండ నుంచి బదిలీ చేశారని... చాలా రోజులు పోస్టింగ్ ఇవ్వకుండా పక్కన పెట్టారన్నారు. తాను ప్రస్తుతానికి క్యాన్సర్ చికిత్స కోసం అమెరికాకు వచ్చానని.. చికిత్స పూర్తయిన తర్వాత భారత్ కు వస్తానని కోర్టుకు తెలిపారు.


More Telugu News