టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయి: ధర్మపురి అర్వింద్

  • కాంగ్రెస్ అధికారంలోకి వస్తే దేశం తీవ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని హెచ్చరిక
  • ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సిమి టెర్రరిస్ట్ సంస్థ ప్రకటించిందన్న ఎంపీ
  • ఎన్నికలు బీజేపీకి, టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా? అనే సందేహం కలుగుతోందని వ్యాఖ్య
లోక్ సభ ఎన్నికల్లో టెర్రరిస్ట్ సంస్థలన్నీ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించాయని... ఆ పార్టీ కనుక అధికారంలోకి వస్తే దేశం ఉగ్రవాదుల చేతుల్లోకి వెళుతుందని నిజామాబాద్ ఎంపీ, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన నిజామాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ... ముస్లింలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని సిమి టెర్రరిస్ట్ సంస్థ ప్రకటించిందన్నారు. ఈ ఎన్నికలు బీజేపీకి, టెర్రరిస్టులకు మధ్య జరుగుతున్నాయా? అనే సందేహం కలుగుతోందన్నారు.

నిషేధిత సిమిపై 15 తీవ్రవాద కేసులు ఉన్నాయని పేర్కొన్నారు. పీఎఫ్ఐ, సిమికి కాంగ్రెస్ మాతృసంస్థగా మారిందని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ రెండు సంస్థలు కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ చేస్తున్నాయన్నారు. ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రభుత్వాన్ని ఆ సంస్థలే కంట్రోల్‌ చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. జగిత్యాల పీఎఫ్‌ఐకి అడ్డాగా, బోధన్ నకిలీ పాస్‌పోర్టులకు అడ్డాగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.


More Telugu News