సినిమా పాప్యులారిటీ వెంటనే ఓట్లుగా బదిలీ కావు: పవన్ కల్యాణ్
- బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదన్న పవన్
- బీజేపీ హిందూత్వ వైపు కొద్దిగా మొగ్గు చూపుతుందంతేనని వ్యాఖ్య
- కూటమి కోసం తన పార్టీ తరఫున ప్రత్యేక త్యాగాలు చేయాల్సి వచ్చిందని వెల్లడి
సినిమాల ద్వారా వచ్చే ప్రజాకర్షణ వెంటనే ఓట్లుగా బదిలీ కావని జనసేన వ్యవస్థాపక అధ్యక్షుడు, సినీనటుడు పవన్ కల్యాణ్ తెలిపారు. జాతీయ టీవీ ఛానెల్ ఎన్డీటీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ...రాజకీయాల్లో స్థిరత్వం ఒక్కటే విజయాన్ని అందిస్తుందని పవన్ చెప్పారు. బీజేపీ ముస్లింలకు వ్యతిరేకం కాదని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు. బీజేపీ కేవలం హిందూత్వ వైపు కొద్దిగా మొగ్గు చూపుతుందని చెప్పారు. ఇదే విషయాన్ని తాను ముస్లింలకు ధైర్యంగా చెప్పగలనని అన్నారు.
దేశ నిర్మాణంలో బీజేపీ చాలా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. రాజ్యాంగ పరిరక్షణకు తగిన చర్యలు వారు తీసుకోవాల్సి ఉందని పవన్ తెలిపారు. బీజేపీకి ఏ వర్గం మీద వివక్ష, ద్వేషం లేవని, ఇక్కడ కూడా తానెప్పుడూ చూడలేదని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం బీజేపీ, తెలుగుదేశంతో విడిపోయిన తర్వాత మళ్లీ కూటమిగా ఏర్పడటానికి తన పార్టీ తరఫున ప్రత్యేక త్యాగాలు చేయాల్సి వచ్చిందని పవన్ కల్యాణ్ స్పష్టం చేశారు.