కొత్త తిట్ల కోసం పరిశోధన బృందాలను నియమించుకున్నారు: రేవంత్ రెడ్డిపై కిషన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం
- తెలంగాణలో బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్న కిషన్ రెడ్డి
- బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో రేవంత్ రెడ్డిలో అసహనం పెరుగుతోందన్న బీజేపీ నేత
- జర్నలిస్టులను జైల్లో వేస్తామనడం ఆయన గర్వానికి నిదర్శనమని మండిపాటు
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో బీజేపీకి రోజురోజుకూ ఆదరణ పెరుగుతోందన్నారు. తమపై ఎంత దుష్ప్రచారం చేసినా ప్రజలు ఆదరిస్తున్నారన్నారు. బీజేపీకి ఆదరణ పెరుగుతుండటంతో సీఎం రేవంత్ రెడ్డిలో రోజురోజుకూ అసహనం పెరిగిపోతోందని విమర్శించారు. సీఎం హోదాలో ఉన్న విషయాన్ని కూడా ఆయన మరిచిపోయారన్నారు.
జర్నలిస్టులను జైల్లో వేస్తామనడం ఆయన గర్వానికి నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేశారు. తిట్లు, కొత్త కొత్త అబద్దాల కోసం ఆయన పరిశోధన బృందాలను నియమించుకున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ మెజార్టీ సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రికి బూతులు మాట్లాడటం, కోతలు కోయడం తప్ప చేతలు ఏమీ లేవన్నారు. ట్యాక్స్ వసూలు చేసే చేతలు మాత్రమే ఉన్నాయని విమర్శించారు.