లక్ష్మీపురంలో నా యువ మిత్రుడిని కలిశా: తెలుగులో ప్రధాని మోదీ ట్వీట్

  • వరంగల్ ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సందర్భంగా చిన్నారిని ఎత్తుకొని ఆనందించిన మోదీ
  • మోదీతో పాటు ట్వీట్ చేసిన బీజేపీ తెలంగాణ ట్విట్టర్ హ్యాండిల్
  • వరంగల్ ర్యాలీలో మోదీతో పాటు పాల్గొన్న మంద కృష్ణ మాదిగ
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఓ గ్రామంలో ఓ చిన్నారిని ఎత్తుకొని ఫొటో దిగారు. దానిని తన ఎక్స్ ఖాతా వేదికగా ట్వీట్ చేశారు. ఆయన వరంగల్‌లో ఎన్నికల ప్రచారానికి వెళుతున్న సందర్భంగా మార్గమధ్యంలో ఓ చిన్నారిని ఎత్తుకొని ఆనందించారు. ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. మోదీ ట్వీట్ చేస్తూ 'వరంగల్‌లో ప్రచార ర్యాలీకు వెళ్తుండగా లక్ష్మీపురం గ్రామంలో నా యువ మిత్రుడిని కలిశాను' అంటూ తెలుగులో ట్వీట్ చేశారు.

తెలంగాణ బీజేపీ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కూడా ఈ ఫొటోను ట్వీట్ చేసింది. 'తాతయ్యా... నాలాంటి చిన్నారుల భవిష్యత్తు భద్రతకు మీరు గ్యారంటీ... మీ విజయం దేశ ప్రజల గ్యారంటీ' అని పేర్కొంది.

వరంగల్ ర్యాలీలో మంద కృష్ణ మాదిగతో కలిసి...

వరంగల్ ర్యాలీలో ప్రధాని మోదీతో పాటు ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పాల్గొన్నారు. 'వరంగల్‌లో జరిగిన ర్యాలీలో మా తమ్ముడు మంద కృష్ణ మాదిగ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణవ్యాప్తంగా కాంగ్రెస్ మాదిగ వ్యతిరేక వైఖరి చర్చనీయాంశమైంది. మాదిగ సామాజిక వర్గానికి దక్కాల్సిన అవకాశం, గౌరవం లేకుండా పోయాయి. మాదిగ సామాజికవర్గ సంక్షేమం కోసం బీజేపీ ఎప్పుడూ కృషి చేస్తుంది' అని మోదీ ట్వీట్ చేశారు.


More Telugu News