సూర్యకి కథను వినిపిస్తే ఒకే ఒక్కమాట అన్నారాయన: ఎస్వీ కృష్ణారెడ్డి
- హీరో సూర్యకి కథను వినిపించానన్న కృష్ణారెడ్డి
- ఆ కథ ఆయనకి బాగా నచ్చిందని వెల్లడి
- ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని వ్యాఖ్య
- సంగీత దర్శకుడిగా ప్రయోగాలు చేశానని వివరణ
ఎస్వీ కృష్ణారెడ్డి .. కుటుంబ కథాచిత్రాల దర్శకుడిగా ఒక వెలుగు వెలిగారు. ఆయన నుంచి ఎన్నో సూపర్ హిట్లు వచ్చాయి. తన సినిమాలకి తానే సంగీతాన్ని సమకూర్చేవారు. అలా ఆయన దర్శకత్వంలో మ్యూజికల్ హిట్స్ గా నిలిచిన సినిమాలు కూడా ఉన్నాయి. అలాంటి తన కెరియర్ గురించి తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కృష్ణారెడ్డి మాట్లాడారు.
" నేను సంగీతాన్ని బాగా చేస్తున్నాననే పేరు వచ్చింది. నిజానికి నాకు స్వరాలు .. రాగాలు ఇవేవీ తెలియదు. అందువలన నేర్చుకుందామని అనుకున్నాను, కానీ ఇప్పుడు నేర్చుకునే పని పెట్టుకోవద్దు .. ప్రయోగాలు కంటిన్యూ చేయమని పెద్దలు చెప్పారు. దాంతో అలాగే చేస్తూ వెళ్లాను. ఆ మాట వినడమే మంచిదైందనే విషయం ఆ తరువాత అర్థమైంది" అని అన్నారు.
"ఒకసారి నేను దాసరి నారాయణరావుగారి సిఫార్స్ తో హీరో సూర్యను కలిశాను. ఆయనకి కథను చెప్పాను .. ఆ కథ ఆయనకి బాగా నచ్చింది. ఆ విషయాన్ని ఆయన నా ఎదురుగానే జ్యోతిక గారికి కూడా చెప్పారు. కథ చెప్పడం పూర్తికాగానే శభాష్ అన్నారాయన. అయితే ఎందుకనో తెలియదుగానీ ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు " అని చెప్పారు.