సెల్ఫీ కోసం వచ్చిన అభిమాని మెడ పట్టుకుని ఈడ్చిన స్టార్ క్రికెటర్.. వైరల్ వీడియో!
- మరోసారి అభిమాని పట్ల బంగ్లా స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ అనుచిత ప్రవర్తన
- ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్ మ్యాచ్‌లో ఘటన
- షకీబ్ తీరు పట్ల క్రికెట్ అభిమానులు, నెటిజన్ల కన్నెర్ర
బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్ షకీబ్ అల్ హసన్ మరోసారి ఓ అభిమానిపట్ల అనుచితంగా ప్రవర్తించి వార్తల్లో నిలిచారు. ఇప్పటికే పలుమార్లు అభిమానులపై చేయిచేసుకున్న షకీబ్.. ఈసారి ఏకంగా ఓ వ్యక్తి మెడ పట్టుకుని గెంటేస్తున్న వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళ్తే.. షకీబ్ ధాకా ప్రీమియర్ లీగ్‌లో షేక్ జమాల్ ధన్మోండి క్లబ్కు ప్రాతినిథ్యం వహిస్తున్నాడు. అయితే, ఈ లీగ్ లో భాగంగా తాజాగా జరిగిన మ్యాచ్ లో టాస్ వేసే ముందు ఓ అభిమాని పరిగెత్తుకుంటూ సెల్ఫీ కోసం షకీబ్ దగ్గరకు వచ్చాడు. కానీ, షకీబ్ అభిమానితో కుదరదని నిరాకరించాడు. అయితే అభిమాని పలుమార్లు అలాగే సెల్ఫీ కోసం ప్రయత్నించడంతో కోపం తెచ్చుకున్న షకీబ్ అతని మెడ పట్టుకుని ఈడ్చాడు. దీంతో షకీబ్ తీరు పట్ల క్రికెట్ అభిమానులు, నెటిజన్లు కన్నెర్ర చేస్తున్నారు.
కాగా, 37 ఏళ్ల ఈ ఆల్‌రౌండర్‌కు కాంట్రవర్సీలు కొత్తేం కాదు. ఫీల్డ్‌లో అత్యంత కోపిష్టి బంగ్లాదేశ్ ప్లేయర్ ఎవరైనా ఉన్నారంటే ముందుగా గుర్తొచ్చే పేరు షకీబ్‌దే. ఈ కోపంతో పలుమార్లు వార్తల్లోకి కూడా ఎక్కాడు. దేశవాళీ లీగ్‌లో అంపైర్లు తీసుకున్న నిర్ణయంపై చిర్రెత్తుకుపోవడం, స్టంప్‌లను తన్నేయడం, సెల్ఫీలంటూ వచ్చిన అభిమానులను తరిమేయడం వంటి విషయాలతో తరచూ వార్తల్లో నిలుస్తుంటాడు.
ఇక ఈ ఆల్ రౌండర్ బంగ్లాదేశ్ జాతీయ జట్టు తరఫున చాలా కాలంగా క్రికెట్ ఆడుతున్నాడు. 2006 నుండి ఇప్పటి వరకు 67 టెస్టులు, 247 వన్డేలు, 117 టీ20లు ఆడిన షకీబ్ ఆ దేశంలో ఒక లెజెండరీ క్రికెటర్. ప్రస్తుతం టీ20ల్లో బంగ్లాదేశ్‌కు ఆల్‌రౌండర్‌గా అగ్రస్థానంలో ఉన్నాడు. వన్డేలలో అతను రెండవ ర్యాంక్ ఆల్ రౌండర్. అలాగే షకీబ్ బంగ్లాదేశ్ తరపున టెస్ట్‌లలో మూడవ ర్యాంక్‌లో కొనసాగుతున్నాడు.