'సైతాన్' లో ఉత్కంఠను రేకెత్తించే అంశం అదే!
- అజయ్ దేవగణ్ హీరోగా రూపొందిన 'సైతాన్'
- కీలకమైన పాత్రల్లో మాధవన్ - జ్యోతిక
- సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్లో సాగే కథ
- ఈ నెల 3 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
అజయ్ దేవగణ్ .. జ్యోతిక .. మాధవన్ ప్రధానమైన పాత్రలను పోషించిన 'సైతాన్', మార్చి 8వ తేదీన విడుదలైంది. వికాస్ భల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా, సూపర్ నేచురల్ హారర్ థ్రిల్లర్ జోనర్లో రూపొందింది. అమిత్ త్రివేది సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమా, మే 3వ తేదీ నుంచి 'నెట్ ఫ్లిక్స్' లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఈ సినిమా ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై దూసుకుపోతోంది.
కబీర్ .. భార్య .. కూతురు .. ఒక చిన్న ఫ్యామిలీ. ఈ ముగ్గురూ కలిసి ఒకరోజున ఫామ్ హౌస్ కి వెళతారు. అనుకోకుండా వాళ్ల జీవితంలోకి వనరాజ్ ఎంటరవుతాడు. `అతని రాకతో వారి జీవితం అనూహ్యమైన మలుపు తిరుగుతుంది. వనరాజ్ వశీకరణకి లోనైన కబీర్ కూతురు విపరీతంగా ప్రవర్తించడం మొదలెడుతుంది.
వనరాజ్ బారి నుంచి బయటపడాలని భావించిన కబీర్ కి కూతురు వైపు నుంచే ప్రధానమైన సమస్య మొదలవుతుంది. కూతురును రక్షించుకుని .. ఆ తరువాత తమని తాము కాపాడుకునే పరిస్థితి వస్తుంది. కబీర్ దంపతులు తమ కూతురును మామూలు మనిషిగా చేయడానికి పడే ఆరాటమే ఈ సినిమాకి హైలైట్. మిగతా అంశాల సంగతి అలా ఉంచితే, ఈ పాయింట్ మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ అవుతుంది.