ఆహా ఫ్లాట్ ఫామ్ పైకి విజయ్ ఆంటోని 'రోమియో'
- తమిళంలో విడుదలైన 'రోమియో'
- తెలుగు టైటిల్ గా 'లవ్ గురు'
- విజయ్ ఆంటోని జోడీకట్టిన మృణాళిని రవి
- ఈ నెల 10వ తేదీ నుంచి స్ట్రీమింగ్
తమిళంతో పాటు తెలుగులోను విజయ్ ఆంటోనికి మంచి ఇమేజ్ ఉంది. 'బిచ్చగాడు' తరువాత ఆయన ఎన్ని సినిమాలు చేసినా, 'బిచ్చగాడు 2' మాత్రమే మళ్లీ విజయాన్ని తీసుకొచ్చింది. ఈ క్రమంలో ఆయన నుంచి వచ్చిన మరో సినిమానే 'రోమియో'. తమిళంలో ఏప్రిల్ 11వ తేదీన థియేటర్లకు ఈ సినిమా వచ్చింది. ఈ నెల 10వ తేదీ నుంచి ఆహాలోను .. అమెజాన్ ప్రైమ్ లోను స్ట్రీమింగ్ కానుంది.
విజయ్ ఆంటోని జోడీగా మృణాళిని రవి నటించిన ఈ సినిమాకి, భరత్ ధనశేఖర్ సంగీతాన్ని అందించాడు. వినాయక్ వైద్యనాథన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను, 'లవ్ గురు' టైటిల్ తో తెలుగులోను విడుదల చేశారు. అయితే ఆ తమిళంలోను .. ఇటు తెలుగులోను ఈ సినిమా ఆశించినస్థాయిలో ఆకట్టుకోలేకపోయింది.
అలాంటి ఈ సినిమా ఇప్పుడు ఆహా ఫ్లాట్ ఫామ్ ద్వారా పలకరించడానికి రెడీ అవుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనేది అరవింద్ (విజయ్ ఆంటోని) ఆశ. హీరోయిన్ కావాలనేది లీల (మృణాళిని రవి) కోరిక. అలాంటి ఈ ఇద్దరి మధ్య పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారుతుందా? ఇద్దరి ఆశలు నెరవేరుతాయా? అనేది మిగతా కథ. ఓటీటీ వైపు నుంచి ఈ సినిమా ఎలాంటి రిజల్టును రాబడుతుందనేది చూడాలి.