సోషల్ మీడియా పైత్యమే ఇది.. సజ్జనార్

  • బైక్ తో స్టంట్లు చేస్తున్న కుర్రాళ్ల వీడియోతో ట్వీట్
  • ప్రాణాలను పణంగా పెడుతున్నారంటూ ఫైర్
  • పరోక్షంగా వారి తల్లిదండ్రులదే బాధ్యతన్న ఆర్టీసీ ఎండీ
రోజురోజుకూ యువతలో సోషల్ మీడియా పిచ్చి పెరిగిపోతోందని టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ చెప్పారు. ఆన్ లైన్ వేదికల్లో ఫేమస్ కావడానికి ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. రోడ్లపై ప్రమాదకరంగా ఫీట్లు చేస్తూ వారితో పాటు మిగతా వారి ప్రాణాలకూ ముప్పుగా మారుతున్నారని విమర్శించారు. ఈమేరకు బైక్ తో ముగ్గురు కుర్రాళ్లు హైవేపై స్టంట్లు చేస్తున్న వీడియోను ట్వీట్ చేస్తూ సజ్జనార్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ యువకులు ఇలా నిర్లక్ష్యంగా, బాధ్యతారహితంగా మారడానికి పరోక్షంగా వారి తల్లిదండ్రులే కారణమని విమర్శించారు. వారి పర్యవేక్షణ లోపం కారణంగానే వీరిలా రోడ్లపై వెర్రి వేషాలు వేస్తున్నారని సజ్జనార్ ఆక్షేపించారు. సోషల్ మీడియా పైత్యాన్ని తగ్గించుకోవాలని, ప్రాణాలకు తెగించి ఫీట్లు చేయొద్దని యువతకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్ సూచించారు.


More Telugu News