తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో ఎల్లో అలెర్ట్ జారీ
- తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు
- నిన్న సాయంత్రం హైదరాబాద్‌ను ముంచెత్తిన వాన
- సికింద్రాబాద్‌లో అత్యధికంగా 136.8 సెంటీమీటర్ల వర్షం
- హెచ్చరికలు జారీచేసిన పోలీసు శాఖ
హైదరాబాద్‌లో మంగళవారం సాయంత్రం కురిసిన భారీ వర్షం ఎండలతో అల్లాడుతున్న ప్రజలకు కొంత ఉపశమనం కలిగించినా.. వాహనదారులు, ప్రయాణికులకు మాత్రం ఇబ్బందులు తెచ్చిపెట్టింది. లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి. ఈదురుగాలులకు చాలా ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. దీంతో విద్యుత్తు సరఫరా నిలిచిపోయింది. రోడ్లు చెరువుల్లా మారడంతో నగరవ్యాప్తంగా ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి. దీంతో కిలోమీటర్ల పొడవునా వాహనాలు నిలిచిపోయాయి.
నిన్న సాయంత్రం ఏడు గంటల సమయానికే సికింద్రాబాద్‌లో అత్యధికంగా 136.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. కేపీహెచ్‌బీలో 102.3 సెంటీమీటర్లు, చందానగర్‌లో 86 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తుండడంతో వాతావరణశాఖ ఎల్లో అలెర్ట్ జారీచేసింది. పోలీసుశాఖ కూడా అప్రమత్తమైంది. పిడుగులు పడే ప్రమాదం ఉండడంతో ఎవరూ చెట్ల కిందకు వెళ్లవద్దని, ట్రాన్స్‌ఫార్మర్లు, విద్యుత్ స్తంభాలను తాగవద్దని హెచ్చరించింది. అలాగే, శిథిలావస్థలో ఉన్న భవనాలకు దూరంగా ఉండాలని, అత్యవసరమైతే 100కి డయల్ చేయాలని కోరింది.