సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్న సుంద‌ర్ పిచాయ్ 30 ఏళ్ల కింద‌టి ఫొటో!

  • 1993 ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ కాన్వ‌కేష‌న్ డే నాటి సుంద‌ర్ పిచాయ్ ఫొటో
  • 30 ఏళ్ల నాటి ఫొటోను 'ఎక్స్' ద్వారా పంచుకున్న ఆయ‌న బ్యాచ్‌మేట్ కూతురు అనన్య లోహాని  
  • ఒకే ఫ్రేమ్‌లో ద‌ర్శ‌న‌మిచ్చిన‌ పిచాయ్‌, మ్యాచ్ గ్రూప్ సీఈఓ శర్మిష్ట దూబే
గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ 30 ఏళ్ల కింద‌టి కాలేజ్ డేస్ ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.  1993 ఐఐటీ ఖరగ్‌పూర్ కాన్వొకేషన్ డే తాలూకు ఫొటో అది. ఈ ఫొటోను ఆయ‌న బ్యాచ్‌మేట్ కూతురు అనన్య లోహాని ఎక్స్ (ట్విట‌ర్‌) లో షేర్ చేశారు. ఈ ఫొటోలో ఏకైక మహిళా క్లాస్‌మేట్, మ్యాచ్ గ్రూప్ సీఈఓ శర్మిష్ట దూబే కూడా ఉన్నారు. దూబే భారతదేశంలో జన్మించిన అమెరికన్ ఎగ్జిక్యూటివ్. ఆమె మ్యాచ్ గ్రూప్ సీఈఓగా ప‌నిచేయ‌డం విశేషం. మ్యాచ్ గ్రూప్ అనేది టిండ‌ర్‌, OkCupid వంటి అనేక డేటింగ్ యాప్‌లను కలిగి ఉంది.

"1993లో ఐఐటీ ఖ‌ర‌గ్‌పూర్ కాన్వ‌కేష‌న్‌లో సుంద‌ర్ పిచాయ్‌తో దిగిన ఫొటోను మా నాన్న షేర్ చేశారు. అతనితో సుందర్ పిచాయ్, శర్మిష్ట దూబే ఒకే ఫ్రేమ్‌లో ఉన్నారు. ఇది చాలా క్రేజీగా ఉంది" అని ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ డెవలపర్ అనన్య లోహాని 'ఎక్స్‌' లో ఫొటోను పంచుకుంటూ రాశారు. కాగా, ఈ చిత్రంపై గూగుల్, ఆల్ఫాబెట్ సీఈఓ ఇంకా స్పందించలేదు.

ఇక‌ సుంద‌ర్‌ పిచాయ్, దూబే శ‌ర్మిష్ట‌ ఇద్దరూ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో మెటలర్జీలో 1993 బ్యాచ్ బీటెక్ చ‌దివారు. ఇండియాలో చ‌దివి అమెరికాలోని గూగుల్ సీఈఓగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తున్న సుంద‌ర్ పిచాయ్ ఎంతో మందికి స్ఫూర్తి. అటు ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌ను ఆవిష్కరించినందుకు ఘనత పొందిన శర్మిష్ట దూబే ఐఐటీలో అతని ఏకైక మహిళా క్లాస్‌మేట్. దూబే 2020 మార్చి నుండి 2022 మే వరకు మ్యాచ్ గ్రూప్ సీఈఓగా పనిచేశారు.


More Telugu News