రైతు భరోసాపై ఈసీ ఆంక్షలు... తీవ్రంగా స్పందించిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి

  • రైతు భరోసా నిధులు పడకుండా చేసింది బీజేపీ, బీఆర్ఎస్ అని ఆరోపణ
  • ఆ పార్టీలు చేసే రాజకీయాలకు రైతులు బలవుతున్నారని ఆవేదన
  • రైతు భరోసా నిధులు అడ్డుకున్నది ఎవరో తేలుస్తామన్న అద్దంకి దయాకర్
ఎన్నికల సంఘం రైతు భరోసాపై ఆంక్షలు విధించడం మీద తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రంగా స్పందించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... బీజేపీ, బీఆర్ఎస్ రాజకీయాలకు రైతులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు భరోసా నిధులు పడకుండా చేసి ఆ రెండు పార్టీలు రైతుల నోట్లో మట్టి కొట్టాయని ఆరోపించారు. రైతుల ఖాతాల్లో పడే నిధులను ఆపేలా కుట్ర చేయడం బాధాకరన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ కుట్రలను అన్నదాతలు అర్థం చేసుకున్నారన్నారు.

అడ్డుకున్నది ఎవరో తేలుస్తాం: అద్దంకి దయాకర్

రైతు భరోసా నిధులను అడ్డుకున్నది ఎవరు? తమపై అక్కసుతోనే రైతు భరోసా నిధులు పడకుండా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారని అద్దంకి దయాకర్ ఆరోపించారు. నిధులు ఇవ్వకుంటే ఇవ్వలేదని ధర్నాలు చేస్తారని... ఇస్తేనేమో అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నిధులు రాకుండా అడ్డుకున్నది ఎవరో తేలుస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ రైతు వ్యతిరేక పార్టీలు అన్నారు.


More Telugu News