జమ్మూకశ్మీర్ లో ఎన్ కౌంటర్ ..ఇద్దరు ఉగ్రవాదుల హతం
- ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో తనిఖీలు చేపట్టిన భద్రతా బలగాలు
- దగ్గరకు రాగానే బలగాలపైకి కాల్పులు ప్రారంభించిన ఉగ్రవాదులు
- ఉగ్రవాదుల కాల్పులను సమర్థవంతంగా తిప్పికొట్టిన భారత బలగాలు
జమ్మూకశ్మీర్ లోని కుల్గం జిల్లాలో భారత భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. జిల్లాలోని రెడ్వానీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో భారత భద్రతా బలగాలు ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు నక్కిన ప్రాంతం సమీపంలోకి భద్రతా బలగాలు చేరుకోగానే ఒక్కసారిగా కాల్పులు ప్రారంభించారు. దీంతో అప్రమత్తమైన భారత భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.
కాగా, అనంత్ నాగ్ -రాజౌరి లోక్ సభ నియోజకవర్గానికి ఈ నెల 25న పోలింగ్ జరగనుంది. మంగళవారం ఎన్ కౌంటర్ జరిగిన కుల్గం జిల్లా అనంత్ నాగ్ - రాజౌరీ నియోజకవర్గం పరిధిలోనిదే. ఈ నేపథ్యంలో రాజకీయ నేతలు ఈ ప్రాంతంలో ఎక్కువగా ప్రచారం నిర్వహించేందుకు షెడ్యూల్ వేసుకుని ఉన్నారు.