ప్రజ్వల్ ను దేశం దాటించారు.. మమ్మల్ని అరెస్ట్ చేయడం దారుణం: కవిత

  • రౌస్ అవెన్యూ కోర్టుకు హాజరైన కవిత
  • జ్యుడీషియల్ కష్టడీని పొడిగించిన కోర్టు
  • కోర్టు ప్రాంగణంలో మీడియాతో మాట్లాడిన కవిత
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవిత జ్యుడీషియల్ కస్టడీని రౌస్ అవెన్యూ కోర్టు పొడిగించిన సంగతి తెలిసిందే. ఈ నెల 14వ తేదీ వరకు కస్టడీని పొడిగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. మరోవైపు కోర్టు ప్రాంగణంలో పోలీసు సిబ్బంది మధ్య నడుచుకుంటూ వెళ్తున్న కవితను మీడియా ప్రతినిధులు పలకరించారు. మేడమ్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అని ఆమెను ప్రశ్నించారు. దీనికి ఆమె సమాధానమిస్తూ... 'ప్రజ్వల్ రేవణ్ణ వంటి వారిని దేశం దాటించారు. మాలాంటి వాళ్లను అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరుతున్నా' అని చెప్పారు. జై తెలంగాణ అని నినదిస్తూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరోవైపు, వారం రోజుల్లోగా కవితపై ఈడీ ఛార్జ్ షీట్ వేయబోతోంది. 



More Telugu News