రాష్ట్రంలో గతేడాదికంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాలు తగ్గాయి: అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ

  • రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించడం వల్లేనన్న అసోం సీఎం
  • వీటికి తోడు నిబంధనలు కఠినంగా అమలు చేశామన్న హిమంత బిశ్వశర్మ
  • జనవరి-ఏప్రిల్ మధ్య కాలాన్ని గతేడాది తో పోల్చితే 22 శాతం మరణాలు తగ్గాయని పోస్ట్ చేసిన సీఎం
తమ ప్రభుత్వం చేపట్టిన చర్యల వల్ల గతేడాదికంటే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందని అసోం ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ తెలిపారు. నిరంతరాయంగా తమ ప్రభుత్వం రోడ్డు భద్రతా ప్రమాణాలు పాటించడం, నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్లే రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిందని ఎక్స్ వేదికగా ఆయన ప్రకటించారు. 

2023 జనవరి నుంచి ఏప్రిల్ మధ్యకాలంతో పోలిస్తే ఈ ఏడాది జనవరి-ఏప్రిల్ మధ్య కాలంలో 22 శాతం రోడ్డు ప్రమాద మరణాలు తగ్గాయని అందులో పేర్కొన్నారు. 2022 డిసెంబర్, 2023 డిసెంబర్ తో పోలిస్తే కనీసం 30.69 శాతం రోడ్డు ప్రమాదాలు తగ్గాయని తెలిపారు. ఇక గతేడాది జనవరి ఈ ఏడాది జనవరితో పోలిస్తే 24.6 శాతం రోడ్డు ప్రమాదాల్లో మరణాల సంఖ్య తగ్గిందని అందులో పేర్కొన్నారు. 



More Telugu News