ఏపీ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన హరీశ్ కుమార్ గుప్తా

  • కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని బదిలీ చేసిన ఈసీ
  • కొత్త డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తా నియామకం
  • వెంటనే బాధ్యతలు స్వీకరించాలన్న ఈసీ
సీనియర్ ఐపీఎస్ అధికారి హరీశ్ కుమార్ గుప్తా ఏపీ కొత్త డీజీపీగా నియమితులైన సంగతి తెలిసిందే. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేయడంతో, ఆయన స్థానంలో హరీశ్ కుమార్ గుప్తా రాష్ట్ర పోలీస్ బాస్ గా వచ్చారు. ఈసీ ఆదేశాల నేపథ్యంలో, హరీశ్ కుమార్ గుప్తా ఈ సాయంత్రం డీజీపీగా బాధ్యతలు స్వీకరించారు. 

నిన్నటివరకు డీజీపీగా ఉన్న కేవీ రాజేంద్రనాథ్ రెడ్డిని ఈసీ బదిలీ చేసింది. ఆయనకు ఎలాంటి ఎన్నికల విధులు అప్పగించవద్దని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి అధికార పక్షానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని టీడీపీ నేతలు ఈసీకి ఫిర్యాదు చేశారు.

రాజేంద్రనాథ్ రెడ్డి బదిలీ నేపథ్యంలో, నిన్న తాత్కాలిక డీజీపీగా శంఖబ్రత బాగ్చి బాధ్యతలు అందుకున్నారు. ఇవాళ ఈసీ పూర్తిస్థాయి డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాను నియమిస్తూ  ఉత్తర్వులు జారీ చేసింది.


More Telugu News