ఏపీలో ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలకు నో చెప్పిన ఈసీ
- ఇన్ పుట్ సబ్సిడీ విడుదలపై సీఎస్ నేతృత్వంలో కమిటీ సమావేశం
- ఈసీకి ప్రతిపాదనలు పంపిన స్క్రీనింగ్ కమిటీ
- ఎన్నికల ప్రక్రియ ముగిసేవరకు నిధుల విడుదల వాయిదా వేయాలన్న ఈసీ
కేంద్ర ఎన్నికల సంఘం నేడు కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీలో ప్రభుత్వ పథకాల విడుదలకు అభ్యంతరం చెప్పింది. ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు ప్రభుత్వ పథకాలకు నిధుల విడుదలను వాయిదా వేయాలని ఈసీ స్పష్టం చేసింది. పథకాలకు నిధుల విడుదలపై ఇవాళ ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి అధ్యక్షతన స్క్రీనింగ్ కమిటీ చర్చించింది. రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ చెల్లించేందుకు స్క్రీనింగ్ కమిటీ ఈసీకి ప్రతిపాదనలు పంపింది. అయితే, ఎన్నికల సంఘం ఈ ప్రతిపాదనలను తిరస్కరించింది. ఎన్నికలు ముగిశాకే ఇన్ పుట్ సబ్సిడీ నిధులు విడుదల చేయాలని స్పష్టం చేసింది.