'ప్లేయర్ ఆఫ్ ది మంత్' అవార్డు రేసులో రెండు చిన్న దేశాల కెప్టెన్లు

  • ఏప్రిల్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పోటీ ప‌డుతున్న షాహీన్ షా అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ సార‌ధి ముహమ్మద్ వసీమ్
  • స్వ‌దేశంలో కివీస్‌తో చ‌క్క‌టి ప్ర‌ద‌ర్శ‌న చేసిన అఫ్రిది
  • నమీబియాపై 3-2తో సిరీస్ గెల‌వడంలో ఒమన్ సార‌ధి ఎరాస్మస్ కీల‌క పాత్ర  
  • ఒమన్‌లో జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌ను గెల‌వ‌డంలో యూఏఈ జ‌ట్టు కెప్టెన్‌ వసీమ్‌ది కీరోల్‌
ఏప్రిల్ నెల‌కు గాను ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు కోసం పాకిస్థాన్ లెఫ్టార్మ్ ఫాస్ట్ బౌలర్ షాహీన్ షా అఫ్రిది, నమీబియా కెప్టెన్ గెర్హార్డ్ ఎరాస్మస్, యూఏఈ సార‌ధి ముహమ్మద్ వసీమ్ పోటీ ప‌డుతున్నారు. న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరిగిన ఐదు టీ20 మ్యాచ్‌ల‌ సిరీస్‌లో అద్భుతంగా రాణించి ఎనిమిది వికెట్లు తీసిన అఫ్రిది ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు గెలిచాడు. దీంతో త‌న అద్భుత ప్ర‌ద‌ర్శ‌న కార‌ణంగా షాహీన్ అఫ్రిది ఈ అవార్డు రేసులో నిలిచాడు. 

మరోవైపు మస్కట్‌లో నమీబియాపై 3-2తో సిరీస్ గెల‌వడంలో ఒమన్ సార‌ధి ఎరాస్మస్ కీల‌క పాత్ర పోషించాడు. సిరీస్‌లో 145 పరుగులు చేయ‌డంతో పాటు ఎనిమిది వికెట్లు పడగొట్టాడు. ఎరాస్మస్ రెండు మ్యాచుల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు కూడా అందుకున్నాడు. ఇలా అద్భుత ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచినందుకు ప్లేయ‌ర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో ఉన్నాడు. 

అలాగే యూఏఈ జ‌ట్టు కెప్టెన్‌ వసీమ్ ఒమన్‌లో జరిగిన ఏసీసీ ప్రీమియర్ కప్‌ను గెల‌వ‌డంలో కీల‌కంగా వ్య‌వ‌హ‌రించాడు. ఈ సిరీస్‌లో భాగంగా బహ్రెయిన్‌పై అర్ద‌శ‌త‌కం (65), ఆ తర్వాత ఒమన్, కంబోడియాపై వరుసగా 45, 48 ప‌రుగులు బాదాడు. ఇక ఒమ‌న్‌తో జ‌రిగిన‌ ఫైన‌ల్ మ్యాచుల్లో మ‌నోడు ఏకంగా సెంచ‌రీ కొట్టాడు. ఇలా ఏప్రిల్ మాసంలో 44.83 సగటుతో 269 పరుగులు చేశాడు. దీంతో ఇప్పుడు ఐసీసీ పురుషుల ప్లేయర్ ఆఫ్ ది మంత్ అవార్డు రేసులో నిలిచిన‌ మొదటి యూఏఈ క్రికెటర్‌గా అవ‌త‌రించాడు.


More Telugu News