లోక్ సభ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా కొడుకు నామినేషన్, ఎమ్మెల్యేకు బీజేపీ నోటీసులు

  • ఫతేపూర్ సిక్రీ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ తరఫున పోటీ చేస్తున్న రాజ్ కుమార్ చాహర్
  • స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేసిన స్థానిక ఎమ్మెల్యే బాబులాల్ తనయుడు
  • క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో చెప్పాలని నోటీసులు
లోక్ సభ ఎన్నికల్లో కొడుకు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేయడంతో తమ ఎమ్మెల్యేకు బీజేపీ నోటీసులు జారీ చేసింది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఫతేపూర్ సిక్రీ లోక్ సభ స్థానం నుంచి బీజేపీ సిట్టింగ్ ఎంపీ రాజ్ కుమార్ చాహర్ పోటీ చేస్తున్నారు. అయితే ఫతేపూర్ సిక్రీ బీజేపీ ఎమ్మెల్యే బాబులాల్ చౌదరి తనయుడు రామేశ్వర్ చౌదరి ఇక్కడి నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.

లోక్ సభ ఎన్నికల్లో కుమారుడిని బరిలోకి దింపిన బాబులాల్ చౌదరి తీరుపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు భూపేంద్ర సింగ్ చౌదరి ఆదివారం నోటీసులు జారీ చేసినట్లు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోవింద్ నారాయణ్ శుక్లా తెలిపారు. క్రమశిక్షణ చర్యలు ఎందుకు తీసుకోకూడదో సోమవారం సాయంత్రం 5 గంటల్లోపు చెప్పాలని నోటీసుల్లో పేర్కొంది.


More Telugu News