ఉత్తరాఖండ్‌లో నెలల తరబడి కొనసాగుతున్న దావానలం.. ఐదుగురి మృతి.. 1,145 హెక్టార్లలో అడవి బూడిద!
- గతేడాది నవంబరు 1న అంటుకున్న మంటలు
- సమీప గ్రామాలకు మంటలు వ్యాపిస్తుండడంతో భయాందోళనలు
- రేపు వర్షం పడే అవకాశం ఉండడంతో మంటలు అదుపులోకి వచ్చే అవకాశం
ఉత్తరాఖండ్‌లో సంభవించిన దావానలం ఇప్పటి వరకు ఐదుగురి ప్రాణాలు తీసింది. వీరిలో 65 ఏళ్ల సావిత్రిదేవి కూడా ఉంది. రిషికేష్‌లోని ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ నిన్న ప్రాణాలు విడిచింది. గ్రామంలోని తన పొలానికి అంటుకున్న మంటలను ఆర్పే ప్రయత్నంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. అడవికి మంటలు అంటుకున్న ఘటనకు సంబంధించి పోలీసులు నలుగురిపై కేసులు నమోదు చేశారు.
రేపటి నుంచి ఎల్లుండి వరకు ఉత్తరాఖండ్‌లో వర్షం పడే అవకాశం ఉందని, దావానలాన్ని ఇది అదుపు చేసే అవకాశం ఉందని డెహ్రాడూన్ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. గతేడాది నవంబర్ 1న అంటుకున్న కార్చిచ్చు ఇంకా కొనసాగుతోంది. ఇప్పటి వరకు 1,145 హెక్టార్లలోని అడవి కాలి బూడిదైంది. ఈ ఘటనలో ఉత్తరాఖండ్ అటవీ విభాగానికి రూ. 25 లక్షలకు పైగా నష్టం వాటిల్లింది. ఇప్పుడీ మంటలు గ్రామ సమీపాలకు వ్యాపించడంతో గ్రామస్థులు భయాందోళనల మధ్య గడుపుతున్నారు.