పోలవరం ప్రాజెక్టుపై అమిత్ షా ఆరోపణలకు మీ జవాబేంటి?: దేవినేని ఉమ

  • కమీషన్ల కక్కుర్తి వల్లే ప్రాజెక్టు పూర్తికాలేదని కేంద్ర హోంమంత్రి చెప్పారన్న ఉమ
  • ప్రాజెక్టులో జరుగుతున్న పనులనూ ఆపేశారని టీడీపీ నేత మండిపాటు
  • మాజీ సీఎం చంద్రబాబు 72 శాతం పనులు పూర్తిచేశారని వివరణ
పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన ఆరోపణలపై జగన్ ఏం సమాధానమిస్తారంటూ టీడీపీ నేత దేవినేని ఉమ ప్రశ్నించారు. జగన్ కమీషన్ల కక్కుర్తి వల్లే ప్రాజెక్టు పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయని ఆరోపించారు. స్వయంగా కేంద్ర మంత్రి ఈ విషయం వెల్లడించారని గుర్తుచేశారు. రివర్స్ టెండరింగ్ డ్రామాతో ప్రాజెక్టులో జరుగుతున్న పనులనూ ఆపేశారని మండిపడ్డారు. మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టు పనులు 72 శాతం పూర్తయ్యాయని దేవినేని ఉమ గుర్తుచేశారు.

2019 ఫిబ్రవరిలో టీఏసీ లో రూ.55,548 కోట్లకు చంద్రబాబు ఆమోదం తెచ్చారని వివరించారు. అయితే, జగన్ తన సొంత ప్రయోజనాల కోసం రాష్ట్ర భవిష్యత్తును తాకట్టు పెట్టారని ఉమ ఆరోపించారు. అధికారం చేతిలో ఉన్నా, పార్టీకి 33 మంది ఎంపీల బలం ఉన్నా పోలవరం ప్రాజెక్టును పూర్తిచేయలేదని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తికాకపోవడానికి ముమ్మాటికీ జగన్ అవినీతే కారణమని దేవినేని ఉమ ఆరోపించారు.


More Telugu News