'సచిన్ సార్.. సిమెంట్ మిక్సర్ శబ్దం భరించలేకపోతున్నాం'.. లిటిల్ మాస్టర్‌కు పొరుగింటివారి ఫిర్యాదు!
- సబర్బన్ బాంద్రాలో కొత్త ఇంటిని నిర్మిస్తున్న సచిన్
- ఇంటి నిర్మాణ పనుల కాణంగా ఇరుగుపొరుగు వారికి ఇబ్బందులు
- ఇదే విషయమై లిటిల్ మాస్టర్‌కు ఎక్స్ వేదికగా ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తి
భారత క్రికెట్ లెజెండ్, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ఈ ఏడాది ప్రారంభంలో ముంబై సబర్బన్ బాంద్రాలో విశాలమైన దొరబ్ విల్లాను కొనుగోలు చేశారు. ఆ విల్లా స్థానంలో కొత్త బహుళ అంతస్తుల ఇంటిని నిర్మించడానికి ఇప్పటికే ఉన్న నిర్మాణాన్ని కూల్చివేయడం జరుగుతోంది. రెండు నెలల క్రితం ఈ స్థలంలో ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం కార్మికులు ఇంటి నిర్మాణ పనుల్లో బిజీ ఉన్నారు. ఇక ఇంటి నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే శబ్దాలు ఇరుగుపొరుగు వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.
ఈ నేపథ్యంలో సచిన్ తమ నిర్మాణ కార్యకలాపాల కారణంగా అసౌకర్యం కలిగినందుకు క్షమాపణలు కోరుతూ ఒక లేఖ పంపారు. పెర్రీ క్రాస్ రోడ్ ప్రాంతంలోని దాదాపు 100 మంది నివాసితులకు ఇలా సచిన్ పంపిన లేఖ అందింది. అయితే, ఇంటి నిర్మాణ పనులు ఒక నిర్దిష్టమైన సమయం అంటూ లేకుండా అర్ధరాత్రి వరకు జరుగుతున్నాయి. దాంతో సిమెంట్ మిక్సర్ శబ్దం భరించలేకపోతున్నామని ఓ పొరుగింటి వ్యక్తి సోషల్ మీడియా ద్వారా సచిన్‌కు ఫిర్యాదు చేశాడు.
"సచిన్ సార్.. ఇప్పుడు రాత్రి 9 గంటలు అవుతోంది. ఇప్పటికీ మీ బాంద్రాలోని ఇంటి నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. రోజంతా శబ్దాలు.. రాత్రి కూడా అలాగే ఉంది. భారీ శబ్దాల కారణంగా చాలా ఇబ్బందిగా ఉంది. మీ ఇంటి నిర్మాణ కార్మికులను ఒక నిర్దిష్టమైన సమయంలో పనులు చేసుకోవాలని చెప్పగలరు. థ్యాంక్యూ సో మచ్" అంటూ రిక్వెస్ట్ చేశారు. ఇప్పుడీ ట్వీట్ నెట్టింట వైరల్ అవుతోంది.