కొండగట్టు వద్ద దాబాలో కేసీఆర్ సందడి... సెల్ఫీల కోసం పోటెత్తిన పిల్లలు, పెద్దలు

  • తెలంగాణలో మే 13న లోక్ సభ ఎన్నికలు
  • బస్సు యాత్ర ద్వారా కేసీఆర్ ఎన్నికల ప్రచారం
  • వీణవంక నుంచి జగిత్యాల జిల్లా వెళుతూ కొండగట్టు దాబా వద్ద ఆగిన కేసీఆర్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణలో బస్సు యాత్ర కొనసాగిస్తున్నారు. ఈ ఉదయం వీణవంకలో రోడ్ షో ముగిసిన అనంతరం జగితాల్య జిల్లా పర్యటనకు బయల్దేరిన కేసీఆర్... కొండగట్టు సమీపంలోని ఓ దాబా వద్ద ఆగారు. అక్కడ కొన్ని సమోసాలు తిని, చాయ్ తాగారు. కేసీఆర్ రాకతో దాబా వద్ద వాతావరణం మారిపోయింది. జనాలు భారీగా అక్కడికి తరలి రావడంతో సందడి నెలకొంది. పిల్లలు, పెద్దలు కూడా కేసీఆర్ తో సెల్ఫీల కోసం పోటీలు పడ్డారు. వారిని ఏమాత్రం నిరాశపర్చకుండా కేసీఆర్ సెల్ఫీలు దిగి సంతోషపెట్టారు. పిల్లలతో ఆప్యాయంగా ముచ్చటించారు. కాసేపు ఆ దాబాలో విశ్రాంతి తీసుకున్న అనంతరం జగిత్యాల పయనమయ్యారు.


More Telugu News