ధోనీని డకౌట్ చేసిన పటేల్... ఓ మోస్తరు స్కోరు చేసిన చెన్నై

  • ధర్మశాలలో చెన్నై సూపర్ కింగ్స్ × పంజాబ్ కింగ్స్
  • టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై
  • 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు
  • 43 పరుగులు చేసిన రవీంద్ర జడేజా
  • చెరో మూడు వికెట్లతో చెన్నైని దెబ్బతీసిన హర్షల్ పటేల్, రాహుల్ చహర్
ధర్మశాలలో ఇవాళ పంజాబ్ కింగ్స్ తో పోరులో చెన్నై సూపర్ కింగ్స్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 167 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా 43 పరుగులు చేశాడు. కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 43, డారిల్ మిచెల్ 30 పరుగులు సాధించారు. 

చివర్లో బ్యాటింగ్ కు వచ్చిన మహేంద్ర సింగ్ ధోనీ అనూహ్యరీతిలో డకౌట్ అయ్యాడు. ఇన్నింగ్స్ 19వ ఓవర్లో నాలుగో బంతికి శార్దూల్ ఠాకూర్ (17) ను అవుట్ చేసిన పంజాబ్ కింగ్స్ బౌలర్ హర్షల్ పటేల్, అదే ఊపులో ఆ తర్వాత బంతికే ధోనీ బౌల్డ్ చేశాడు. మహేంద్రుడు తానాడిన తొలి బంతికే వెనుదిరగడంతో అభిమానులు ఉసూరుమన్నారు. 

అంతకుముందు, చెన్నై ఇన్నింగ్స్ లో శివమ్ దూబే (0) కూడా డకౌట్ అయ్యాడు. ఓపనర్ అజింక్యా రహానే 9 పరుగులకే వెనుదిరిగాడు. పంజాబ్ కింగ్స్ బౌలర్లలో హర్షల్ పటేల్ 3, రాహుల్ చహర్ 3, అర్షదీప్ సింగ్ 2, కెప్టెన్ శామ్ కరన్ 1 వికెట్ తీశారు.


More Telugu News