ఈసీ ఆదేశాలతో చంద్రబాబు, నారా లోకేశ్ లపై కేసు నమోదు చేసిన సీఐడీ
- చంద్రబాబు, లోకేశ్ పై వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఫిర్యాదు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ ఈసీకి ఫిర్యాదు
- ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని సీఐడీకి ఆదేశాలు ఇచ్చిన ఈసీ
- ఏ1గా చంద్రబాబు, ఏ2గా లోకేశ్
- మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్ లో క్రిమినల్ కేసు
ఎన్నికల వేళ టీడీపీ అధినేత చంద్రబాబు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ లపై ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చంద్రబాబు, లోకేశ్ ఫేక్ ప్రచారం చేస్తున్నారంటూ విజయవాడ సెంట్రల్ వైసీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఐవీఆర్ఎస్ ఫోన్ కాల్స్ ద్వారా ఓటర్లకు తప్పుడు సమాచారం చేరవేస్తున్నారని, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తో మీ భూములు కోల్పోతారు అంటూ ఐవీఆర్ఎస్ సందేశాలు పంపుతున్నారని తన ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న ఎన్నికల సంఘం ఏపీ సీఐడీకి ఆదేశాలు జారీ చేసింది. ఈసీ ఆదేశాలతో మంగళగిరి సీఐడీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. చంద్రబాబు, లోకేశ్ సహా మరో వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేశారు. ఇందులో ఏ1గా చంద్రబాబు, ఏ2గా నారా లోకేశ్ పేర్లను పేర్కొన్నారు.