మొగులయ్యకు కేటీఆర్ ఆర్థిక సాయం
- కిన్నెర వాయిద్యకారుడిని ఆదుకుంటామని ఇటీవల హామీ
- ఆదివారం మొగులయ్యను కలిసి సాయం అందజేత
- మాజీ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపిన మొగులయ్య
తెలంగాణ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ మొగులయ్యకు మాజీ మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం చేశారు. ట్విట్టర్ వేదికగా ఇచ్చిన మాటను కేటీఆర్ నిలబెట్టుకున్నారు. గత ప్రభుత్వం ఇస్తున్న నెలవారీ ఆర్థిక సాయాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడంతో మొగులయ్య ఆర్థికంగా ఇబ్బంది పడ్డారు. కుటుంబ పోషణ కోసం భవన నిర్మాణ కూలీగా మారాడు. మొగులయ్య కూలీ పనులు చేస్తున్న వీడియో ఇటీవల ట్విట్టర్ లో వైరల్ గా మారడంతో మాజీ మంత్రి కేటీఆర్ స్పందించారు.
మొగులయ్యను వ్యక్తిగతంగా, బీఆర్ఎస్ పార్టీపరంగా ఆదుకుంటానని ట్వీట్ చేశారు. ఇచ్చిన మాట ప్రకారం ఆదివారం కిన్నెర మొగులయ్యను కేటీఆర్ కలుసుకున్నారు. మొగులయ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని పార్టీపరంగా అండగా ఉంటామని ధైర్యం చెప్పారు. ఆపై కొంత ఆర్థిక సాయం అందించారు. కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద, ఏంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. కేటీఆర్ తనను కలిసి ఆర్థిక సాయం అందించడంపై మొగులయ్య స్పందిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.