నల్ల తాచుకు నిర్భయంగా కుటుంబం పూజలు..! వీడియో వైరల్
- పోస్ట్ చేసిన ఒక్క రోజులోనే 3.68 లక్షల లైక్ లు
- శివరాత్రి సందర్భంగా పాముకు పూజలపై అవాక్కయిన నెటిజన్లు
- ఫ్యామిలీ ధైర్యానికి కొందరి సలాం.. తప్పుబట్టిన మరికొందరు
పామును చూడగానే చాలా మంది ఆమడ దూరం పరిగెడతారు.. ఇక బ్లాక్ కోబ్రా పడగ విప్పితే అంతే సంగతులు.. అలాంటిది ఓ కుటుంబం మాత్రం నల్ల తాచుకు ప్రత్యేక పూజలు చేసిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఇది ఏ ప్రాంతంలో, ఎప్పుడు జరిగిందో స్పష్టంగా తెలియనప్పటికీ వీడియోను చూస్తే శివరాత్రి సందర్భంగా ఆ కుటుంబం పామును పూజించినట్లు తెలుస్తోంది. ఆ వీడియోలో ఒక వెడల్పాటి పాత్రలో పామును ఉంచి దాని చుట్టూ కుటుంబ సభ్యులంతా కూర్చోవడం కనిపించింది. అర్చకుడు మంత్రాలు చదువుతుండగా కుటుంబ సభ్యులంతా పాముపై నెమ్మదిగా పాలు పోశారు. ఆ సమయంలో పాము పడగవిప్పి కోపంగా అందరినీ చూసింది. అయినా వారు భయపడలేదు. కాసేపటికి కాటేసేందుకు ప్రయత్నించినా వెనక్కి తగ్గలేదు.
ఓంకార్ సనాతని పేరుతో ఓ నెటిజన్ ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో పోస్ట్ చేశాడు. హిందూ సంస్కృతిలో శివుడు, నాగ దేవతకు ఉన్న ప్రాధాన్యత గురించి అందులో వివరించాడు. నాగ పంచమి లాంటి పండుగలకు భక్తులు పాములకు ప్రత్యేక పూజలు చేస్తుంటారని చెప్పాడు. పుట్టల్లో పాలు పోయడం లాంటివి చేస్తుంటారని గుర్తుచేశాడు.
పోస్ట్ చేసిన ఒక్క రోజు వ్యవధిలోనే ఈ వీడియోకు ఏకంగా 3.68 లక్షల లైక్ లు లభించాయి. ఈ వీడియోను చూసిన నెటిజన్లంతా అవాక్కవుతున్నారు. కొందరు నెటిజన్లు ఆ ఫ్యామిలీ ధైర్యానికి సలాం కొట్టగా మరికొందరు మాత్రం విమర్శలు చేశారు. ప్రాణం మీదకు తెచ్చే ఇలాంటి పూజలు సరికాదని కామెంట్ చేస్తున్నారు. ఓ యూజర్ అయితే శివరాత్రి కాబట్టి పామును పూజించారు.. దుర్గా నవరాత్రులు అయితే పులినో లేక సింహానో కూర్చోబెట్టి పూజిస్తారా? అని చురకలు అంటించాడు.