నిలబడి నీళ్లు తాగకూడదా? ఆయుర్వేదం ఏం చెబుతోందంటే..
- నిలబడి నీళ్లు తాగడం హానికరమంటున్న ఆయుర్వేదం
- నిలబడ్డప్పుడు నీళ్లు వేగంగా కడుపులో చేరి జీర్ణరసాల సమతౌల్యం దెబ్బతీస్తుంది
- ఫలితంగా, అరుగుదల సమస్యలు వస్తాయి
- నిలబడి నీళ్లు తాగితే కీళ్లల్లో నీరు పేరుకుని ఆర్థరైటిస్‌కు దారి తీయొచ్చు
నిత్యం పలు పనుల్లో బిజీగా ఉండేవాళ్లు అనేక సందర్భాల్లో నిలబడి నీళ్లు తాగుతుంటారు. ఇలా చేయొచ్చని కొందరు అంటే మరి కొందరు మాత్రం నిలబడి నీరు తాగడం హానికరమని భావిస్తుంటారు. అయితే, ఆయుర్వేదం ఈ అంశంపై విస్పష్టమైన సూచనలు చేసింది. ఆయుర్వేద నిపుణుల ప్రకారం, నిలబడి నీళ్లు తాగడం అనేక రకాల అనారోగ్యాలకు దారి తీస్తుంది.
ఆర్థరైటిస్..
నిలబడి నీళ్లు తాగడం వల్ల కీళ్లల్లో నీరు పేరుకుంటుందట. అంతేకాకుండా, ఫ్లూయిడ్ బ్యాలెన్స్‌ను దెబ్బతిని విషతుల్యాల విడుదలకు కారణమవుతుంది. అంతిమంగా ఇది కీళ్లనొప్పుల బారిన పడేలా చేస్తుంది.
జీర్ణ వ్యవస్థ సంబంధిత సమస్యలు
నిలబడి నీళ్లు తాగడంతో నీరు వేగంగా కడుపులోకి చేరుతుందని ఆయుర్వేదం చెబుతోంది. ఇది కడుపులో జీర్ణరసాల సమతౌల్యాన్ని దెబ్బతీస్తుంది. ఫలితంగా, అరుగుదల తగ్గుతుంది. కాబట్టి, నీటి ప్రయోజనాలు పూర్తిగా పొందాలంటే నిలబడి నీరు తాగకపోవడమే శ్రేయస్కరమని నిపుణులు చెబుతున్నారు.
అయితే, ఆధునిక వైద్య శాస్త్ర నిపుణులు మాత్రం ఈ విషయంలో భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. నిలబడి నీళ్లు తాగినా, కూర్చుని నీళ్లు తాగినా పెద్ద తేడా ఏమీ ఉండదని చెబుతున్నారు. అయితే, పడుకుని మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ నీరు తాగొద్దని హెచ్చరిస్తున్నారు.
వైద్యుల ప్రకారం, శరీరం నీరును వేగంగా గ్రహిస్తుంది. మనం తాగే నీటిలో 66 శాతం కణాల్లోకి చేరుతుంది. 25.5 శాతం కణాల మధ్య ఉండే ఇంటర్‌స్టిషియల్ ఫ్లూయిడ్‌లో భాగమవుతుంది. 8.5 శాతం రక్తంలో కలుస్తుంది. ఇక శరీరంలోని అధికంగా ఉన్న నీటిని, మలినాలను కిడ్నీలు నియంత్రిత విధానంలో తొలగిస్తాయి.