కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటగా చెబుతున్నాను... కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపిస్తే...: కోమటిరెడ్డి
- కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేస్తే తనకు వేసినట్లేనని వ్యాఖ్య
- కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిస్తే కష్టసుఖాల్లో తోడుగా ఉంటామన్న కోమటిరెడ్డి
- నాలుగేళ్లలో మునుగోడు రూపురేఖలు మారుస్తానని హామీ
భువనగిరి లోక్ సభ నియోజకవర్గం నుంచి తమ్ముడు చామల కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని... కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాటగా చెబుతున్నాను... మునుగోడును అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి హామీ ఇచ్చారు. శనివారం మునుగోడు నియోజకవర్గంలో కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... కిరణ్ కుమార్ రెడ్డికి ఓటేస్తే తనకు వేసినట్లే అన్నారు.
తాను తమ్ముడిని (చామల కిరణ్ కుమార్ రెడ్డి) వెంటబెట్టుకొని మీ కష్టసుఖాల్లో అన్నదమ్ముల్లా మీకు అండగా ఉంటామని తెలిపారు. మునుగోడును అభివృద్ధి చేసే బాధ్యతను తీసుకుంటామన్నారు. మునుగోడులో రోడ్లు, ఇళ్లు, ప్రభుత్వ ఆసుపత్రి, ప్రభుత్వ డిగ్రీ కాలేజీ, జూనియర్ కాలేజీ, బస్టాండ్... ఇలా ప్రతి ఒక్కటి చేసే బాధ్యత తనదేనని... మీకు మాట ఇస్తున్నానని... ప్రమాణం చేస్తున్నానన్నారు.
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉందని గుర్తుంచుకోవాలన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే తాను మునుగోడు కోసం కొట్లాడానన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందని... నాలుగేళ్లలో మునుగోడు రూపురేఖలు మారుస్తానని హామీ ఇచ్చారు. మునుగోడులో, చండూరులో... ఇలా అన్నిచోట్లా పార్టీలను పక్కన పెట్టాలని కోరారు.