సిద్దిపేటలో రోడ్డు పక్కన దోశ తిన్న మాజీ మంత్రి హరీశ్ రావు

  • వెంకట్రామిరెడ్డి తరఫున ప్రచారం కోసం వెళుతుండగా సిద్దిపేటలో టిఫిన్ చేసిన హరీశ్ రావు
  • భూంపల్లిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న హరీశ్ రావు
  • కాంగ్రెస్ వచ్చాక బంగారం ధర ఏకంగా రూ.25 వేలు పెరిగిందన్న మాజీ మంత్రి
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు రోడ్డు పక్కన టిఫిన్ చేశారు. హరీశ్ రావుతో పాటు మెదక్ లోక్ సభ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి కూడా అక్కడే టిఫిన్ తిన్నారు. వెంకట్రామిరెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించేందుకు హరీశ్ రావు హైదరాబాద్ నుంచి భూంపల్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో సిద్దిపేట హౌసింగ్ బోర్డు టిఫిన్ బండిపై వారు టిఫిన్ చేశారు. వారితో దోశ వేయించుకొని హరీశ్ రావు ఆరగించారు.

భూంపల్లిలో హరీశ్ రావు ఎన్నికల ప్రచారం

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల కాలంలో బంగారం ధర ఏకంగా రూ.25వేలు పెరిగిందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి మన పార్టీ అధినేత కేసీఆర్‌ను ఇష్టం వచ్చినట్లు విమర్శించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ పార్టీని శిక్షించాలన్నారు. లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని.. లేదంటే వారు మళ్లీ అయిదేళ్లు మనకు దొరకరన్నారు. చావునోట్లో తలపెట్టి తెలంగాణ తీసుకువచ్చిన కేసీఆర్ పైన పరుష పదజాలం మాట్లాడవచ్చా? అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను తిడితే మనల్ని తిట్టినట్లే అన్నారు. రేవంత్ రెడ్డి పొద్దున లేస్తే అయితే తిట్లు... లేదంటే దేవుడి మీద ఒట్లు అని ఎద్దేవా చేశారు.


More Telugu News