ఈరోజు గూగుల్ డూడుల్ చూశారా? ఎవ‌రీ హ‌మీదా బాను?

  • భార‌త మొట్టమొదటి మ‌హిళా రెజ్ల‌ర్ హ‌మీదా బాను స్మారకార్థం ఈరోజు గూగుల్ డూడుల్‌
  • ఈ డూడుల్‌ను చిత్రీక‌రించిన‌ బెంగళూరు కళాకారిణి దివ్య నేగి
  • 1954లో ఇదే రోజున కేవలం 1.34 నిమిషాల్లోనే ప్ర‌ముఖ రేజ్ల‌ర్ బాబా పహల్వాన్‌ను ఓడించిన హ‌మీదా బాను   
  • 'అమెజాన్ ఆఫ్ అలీఘర్' గా పిలువ‌డిన హ‌మీదా బాను
ఇవాళ్టి గూగుల్ డూడుల్ చూశారా? ఆమె భార‌త మొద‌టి మ‌హిళా రెజ్ల‌ర్ హ‌మీదా బాను. భారతదేశపు మొట్టమొదటి ప్రొఫెషనల్ మహిళా రెజ్లర్‌గా పేరొందిన ఆమె స్మారకార్థం ఈరోజు గూగుల్ ఈ డూడుల్‌ను రూపొందించింది. బెంగళూరుకు చెందిన కళాకారిణి దివ్య నేగి ఈ డూడుల్‌ను చిత్రీకరించారు. 

ఎవ‌రీ హ‌మీదా బాను?
మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో పుట్టిన బాను.. జీవితంలో ఒక్క‌సారి కూడా ఓడిపోలేదు. రెజ్లింగ్ పురుషుల‌కే ప‌రిమితమ‌ని భావించే రోజుల్లో హ‌మీదా త‌న‌ను ఓడించిన వారిని పెళ్లి చేసుకుంటాన‌ని స‌వాల్‌ చేయ‌డం గ‌మ‌నార్హం. దానిని స్వీక‌రించి ఆమెతో క‌ల‌బ‌డిన ఎంతోమంది మగాళ్ల‌ను హ‌మీదా మ‌ట్టిక‌రిపించారు. 1954లో ఇదే రోజున జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో కేవలం 1.34 నిమిషాల్లోనే ప్ర‌ముఖ రేజ్ల‌ర్ బాబా పహల్వాన్‌ను ఓడించింది. దీంతో హమీదా బానుకు అంతర్జాతీయ గుర్తింపు ద‌క్కింది. ఇక ఈ ఓటమి తరువాత బాబా పహల్వాన్‌ ప్రొఫెషనల్ రెజ్లింగ్ నుండి విరమించుకున్నారు.
'అమెజాన్ ఆఫ్ అలీఘర్' గా పిలువ‌డిన హ‌మీదా బాను
'అమెజాన్ ఆఫ్ అలీఘర్' అని కూడా పిలువబడిన‌ హమీదా బాను 1900 ప్రారంభంలో ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్ సమీపంలో రెజ్లర్ల కుటుంబంలో జన్మించారు. దాంతో ఆమె చిన్న‌ప్ప‌టి నుంచి రెజ్లింగ్ కళను అభ్యసిస్తూ పెరిగారు. 1940, 1950లలో తన కెరీర్ మొత్తంలో 300కి పైగా రెజ్లింగ్‌ పోటీల్లో విజయం సాధించారు. 

ఆమె విజ‌యాల‌కు గుర్తుగా హమీదా బాను పేరుతో అంతర్జాతీయ టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఆమె రష్యన్ రెజ్లర్ వెరా చిస్టిలిన్‌తో జరిగిన రెజ్లింగ్ మ్యాచ్‌లో రెండు నిమిషాల కంటే తక్కువ వ్యవధిలో గెలిచారు. ఆమె గెలిచిన బౌట్‌లతో హమీదా బాను ఇంటి పేరుగా మారింది. ఇక‌ ఆమె ఆహారం, శిక్షణ నియమావళిని అప్ప‌ట్లో మీడియా విస్తృతంగా కవర్ చేయ‌డం జ‌రిగింది.


More Telugu News