పోరాటాన్ని ఆపేదేలే.. ఓటమి తర్వాత పాండ్యా కీలక వ్యాఖ్యలు

  • ప్రస్తుతం గడ్డు పరిస్థితులు నిజమేనన్న పాండ్యా
  • మంచి రోజులు కూడా వస్తాయని ఆశాభావం
  • యుద్ధభూమి నుంచి పారిపోనన్న ముంబై కెప్టెన్
గత రాత్రి కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓడిన ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు గల్లంతయ్యాయి. ఆడిన 11 మ్యాచుల్లో ఎనిమిదింటిలో ఓడిన ముంబై పాయింట్ల పట్టికలో కింది నుంచి రెండో స్థానంలో ఉంది. ఇకపై ఏదైనా అద్భుతం జరిగితే తప్ప ఆ జట్టు ప్లే ఆఫ్స్ ఆశలు దాదాపు కనుమరుగైనట్టే. 

మ్యాచ్ అనంతరం ముంబై కెప్టెన్ పాండ్యా మాట్లాడుతూ.. యుద్ధం చేస్తూనే ఉండాలని తనకు తాను చెప్పుకుంటూ ఉంటానని పేర్కొన్నాడు. యుద్ధభూమిని ఎప్పుడూ విడిచిపెట్టకూడదన్నాడు. ప్రస్తుతం రోజులు కఠినంగా ఉన్నా.. మంచి రోజులు కూడా వస్తాయని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఇది సవాలుతో కూడుకున్నదే అయినా.. సవాళ్లు మరింత రాటుదేలుస్తాయని పాండ్యా చెప్పుకొచ్చాడు. 

ఓటమికి గల కారణాలపై మాట్లాడుతూ.. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోవడం, భాగస్వామ్యాలు నమోదు చేయలేకపోవడమే తమను దెబ్బతీసిందని అభిప్రాయపడ్డాడు. చాలా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నా, వాటికి సమాధానాలకు కొంత సమయం పడుతుందని చెప్పాడు. ఇప్పటికైతే అంతకుమించి చెప్పలేనని పేర్కొన్నాడు.


More Telugu News