టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన అమెరికా.. కెప్టెన్ స‌హా స‌గం మంది భార‌త సంత‌తి ఆట‌గాళ్లే!

  • టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం 15 మందితో కూడిన స్క్వాడ్‌ను ప్ర‌క‌టించిన యూఎస్‌ 
  • జ‌ట్టు కెప్టెన్‌గా మోనాంక్ ప‌టేల్‌
  • భార‌త సంత‌తి ఆట‌గాళ్లు సౌర‌భ్ నేత్రావ‌ల్క‌ర్‌, హ‌ర్మీత్ సింగ్, మిలింద్ కుమార్‌, నిసార్గ్ ప‌టేల్‌కు చోటు
  • న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్ కోరే అండ‌ర్స‌న్ కూడా ఎంపిక‌
టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ కోసం అమెరికా 15 మంది స‌భ్యుల‌తో కూడిన స్క్వాడ్‌ను ప్ర‌క‌టించింది. అయితే, ఈ జ‌ట్టులో భార‌త సంత‌తికి చెందిన ఆటగాళ్లే స‌గం మంది ఉన్నారు. కెప్టెన్ మోనాంక్ ప‌టేల్‌తో పాటు సౌర‌భ్ నేత్రావ‌ల్క‌ర్‌, హ‌ర్మీత్ సింగ్, మిలింద్ కుమార్‌, నిసార్గ్ ప‌టేల్‌కు ప్ర‌పంచ‌కప్‌ స్క్వాడ్‌లో చోటు ద‌క్కింది. అలాగే న్యూజిలాండ్ మాజీ క్రికెట‌ర్ కోరే అండ‌ర్స‌న్ కూడా ఈ జ‌ట్టులో ఉన్నాడు. అండ‌ర్స‌న్ కివీస్ త‌ర‌ఫున 2015లో జ‌రిగిన వ‌న్డే వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆడిన విష‌యం తెలిసిందే. 

ఇక మిగ‌తా ప్లేయ‌ర్ల‌లో ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్‌), ఎస్ టేల‌ర్‌, జెస్సీ సింగ్‌, కెంజిగే, షాల్క్‌విక్‌, ఆండ్రీస్ గౌస్‌, జ‌హంగీర్‌, అలీఖాన్‌, నితీశ్ కుమార్ ఉన్నారు. అలాగే రిజ‌ర్వ్ ఆట‌గాళ్లుగా గ‌జానంద్‌, డ్రైస్‌డేల్‌, యాసిర్ ఎంపిక‌య్యారు. 

కాగా, యూఎస్ క్రికెట్ జట్టు డల్లాస్‌లో కెనడాతో త‌న తొలి మ్యాచ్ ఆడ‌నుంది. ఆ తర్వాత జూన్ 6న పాకిస్థాన్‌తో, జూన్ 12న భారత్‌తో త‌ల‌ప‌డ‌నుంది. అలాగే ఈ టోర్నీలో త‌న చివ‌రి మ్యాచ్‌ను జూన్ 14న ఫ్లోరిడాలో ఐర్లాండ్‌తో ఆడనుంది. ఇదిలాఉంటే.. ఈసారి అమెరికా, వెస్టిండీస్ ఆతిథ్య‌మిస్తున్న పొట్టి ప్ర‌పంచ‌క‌ప్ జూన్ 2 నుంచి 29వ తేదీ వ‌ర‌కు జ‌ర‌గ‌నుంది. 

2024 ఐసీసీ టీ20 కోసం అమెరికా జ‌ట్టు: 
1. మోనాంక్ పటేల్ (కెప్టెన్)
2. ఆరోన్ జోన్స్ (వైస్ కెప్టెన్)
3. ఆండ్రీస్ గౌస్
4. కోరీ ఆండర్సన్
5. అలీ ఖాన్
6. హర్మీత్ సింగ్
7. జెస్సీ సింగ్
8. మిలింద్ కుమార్
9. నిసార్గ్ పటేల్
10. నితీష్ కుమార్
11. నోష్టుష్ కేంజిగే
12. సౌరభ్ నేత్రల్వాకర్
13.షాడ్లీ వాన్ షాల్క్‌విక్
14. స్టీవెన్ టేలర్
15. షాయన్ జహంగీర్
రిజర్వ్ ఆటగాళ్లు: జువానో డ్రైస్‌డేల్, గజానంద్ సింగ్, యాసిర్ మహ్మద్.


More Telugu News