కోల్ కతా నైట్ రైడర్స్ కు పేస్ దెబ్బ రుచి చూపిన ముంబయి ఇండియన్స్

  • వాంఖెడే స్టేడియంలో ముంబయి ఇండియన్స్ × కోల్ కతా నైట్ రైడర్స్
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న ముంబయి ఇండియన్స్
  • 19.5 ఓవర్లలో 169 పరుగులకు ఆలౌట్ అయిన కోల్ కతా
  • చెరో 3 వికెట్లు తీసిన తుషార, బుమ్రా... 2 వికెట్లు పడగొట్టిన పాండ్యా 
  • 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచిన వెంకటేశ్ అయ్యర్
హార్దిక్ పాండ్యా నాయకత్వంలోని ముంబయి ఇండియన్స్ ఇవాళ కోల్ కతా నైట్ రైడర్స్ తో మ్యాచ్ లో ఆకట్టుకునే బౌలింగ్ ప్రదర్శన కనబర్చింది. ముఖ్యంగా, ముంబయి ఇండియన్స్ పేసర్లు కోల్ కతాను గట్టి దెబ్బ కొట్టారు. 

టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది. దాంతో, తొలుత బ్యాటింగ్ కు దిగిన కోల్ కతా నైట్ రైడర్స్ 19.5 ఓవర్లలో 169 పరుగులకే ఆలౌట్ అయింది. ముంబయి పేసర్లు నువాన్ తుషార 3, జస్ప్రీత్ బుమ్రా 3, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 2 వికెట్లతో సత్తా చాటారు. లెగ్ స్పిన్నర్ పియూష్ చావ్లాకు ఒక వికెట్ దక్కింది. 

మొదట తుషార కోల్ కతా టాపార్డర్ ను దెబ్బతీయగా, ఆ తర్వాత హార్దిక్ పాండ్యా, బుమ్రా విజృంభించారు. కోల్ కతా ఇన్నింగ్స్ లో వెంకటేశ్ అయ్యర్ 70 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు. అయ్యర్ 52 బంతులు ఎదుర్కొని 6 ఫోర్లు, 3 సిక్సర్లు కొట్టాడు. మనీశ్ పాండే 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో 42 పరుగులు చేశాడు. 

సునీల్ నరైన్ (8), ఫిల్ సాల్ట్ (5), రఘువంశీ (13), కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ (6), రింకూ సింగ్ (9), ఆండ్రీ రసెల్ (7) విఫలమయ్యారు.


More Telugu News