రుణమాఫీ చేస్తే పదవికి రాజీనామా చేస్తా... అన్ని హామీలు నెరవేరిస్తే ఇక పోటీయే చేయను: రేవంత్ రెడ్డికి హరీశ్ రావు సవాల్
- హామీలు నెరవేర్చకపోతే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలన్న హరీశ్ రావు
- 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు.. కానీ అమలు చేయలేదని విమర్శ
- రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా? అని ప్రశ్న
రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని రేవంత్ రెడ్డి అందరి దేవుళ్ల మీద ఒట్టు వేసి చెబుతున్నారని, ఒకవేళ చేయకపోతే కనుక ఆయన తన సీఎం పదవికి రాజీనామా చేయాలని... రుణమాఫీ చేస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు మరోసారి సవాల్ చేశారు. ఆరు గ్యారెంటీలు సహా అన్ని హామీలు నెరవేరిస్తే కనుక తాను రాజీనామా చేసి మళ్లీ పోటీ కూడా చేయనన్నారు.
నల్గొండ జిల్లా పరిధిలోని చుండూరులో నిర్వహించిన రోడ్డు షోలో ఆయన మాట్లాడుతూ... కాంగ్రెస్ పార్టీతో ఉన్నది ఇసుక దొంగలు, కాంట్రాక్టర్లు అన్నారు. బీఆర్ఎస్ పార్టీతో అసలైన కార్యకర్తలు ఉన్నారన్నారు. భువనగిరి పార్లమెంట్‌లో గులాబీ జెండా ఎగురబోతుందన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు తొమ్మిది రోజులు కష్టపడితే రానున్న అయిదేళ్లు మీ తరఫున కొట్లాడుతామన్నారు.
100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పారని... కానీ వాటిని అమలు చేయలేదన్నారు. మొదటి హామీగా మహిళలకు నెలకు రూ.2500 ఇస్తామని చెప్పారని... ఈ నాలుగు నెలల కాలంలో ప్రతి మహిళకు రూ.10వేలు రేవంత్ రెడ్డి ప్రభుత్వం బాకీపడిందన్నారు. రెండో హామీగా రైతుబంధు ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ కరోనా కష్ట కాలంలో ఉద్యోగుల జీతాలు బంద్ పెట్టి రైతులను ఆదుకుందన్నారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం కాంగ్రెస్‌కు ఓటేయ్యాలా? ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు కావాలంటే బీఆర్ఎస్‌కు ఓటు వేయాలన్నారు. కాంగ్రెస్ ఈ ఎన్నికల్లో ఓడిపోయినా ప్రభుత్వం పడిపోదని... పథకాల అమలుకు బీఆర్ఎస్ గెలవాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో ధరల పెరుగుదలకు కాంగ్రెస్ కారణమైందని విమర్శించారు. కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి ఫోర్జరీ సంతకం చేసి సస్పెండ్ అయినందుకు టిక్కెట్ ఇచ్చారా? అని ప్రశ్నించారు. భువనగిరి నుంచి బీసీ బిడ్డ క్యామ మల్లేశ్‌ను గెలిపించాలన్నారు. పదేళ్ల బీజేపీ పాలనలో అన్ని ధరలు పెరిగాయన్నారు.