ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి అవినీతి మార్క్ పాలన చూపిస్తున్నారు: కిషన్ రెడ్డి

  • తెలంగాణలో మార్పు వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి... ఏం మార్పు వచ్చిందో చెప్పాలని ప్రశ్న
  • తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చిందని విమర్శ
  • రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఇప్పుడు గాడిద గుడ్డు ఇస్తున్నారని ఎద్దేవా
ఐదు నెలల్లోనే రేవంత్ రెడ్డి అవినీతి మార్క్ పాలనను చూపిస్తున్నారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణలో మార్పు వచ్చిందని చెబుతున్న ముఖ్యమంత్రి... ఏం మార్పు వచ్చిందో చెప్పాలని ప్రశ్నించారు. తెలంగాణలో కేవలం కల్వకుంట్ల కుటుంబ పాలన పోయి సోనియా గాంధీ కుటుంబ పాలన వచ్చిందని విమర్శించారు. ఇదేనా వచ్చిన మార్పు? అని నిలదీశారు. 

రేవంత్ రెడ్డి హామీలు ఇచ్చి ఇప్పుడు గాడిద గుడ్డు ఇస్తున్నారని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని హోర్డింగ్స్ కూడా పెట్టారని... కానీ ఇప్పటి వరకు అమలు చేయలేదన్నారు. ఆరింట ఐదు గ్యారెంటీలు అమలు చేశామని చెబుతున్నారని... కానీ ఎక్కడ చేశారని ప్రశ్నించారు. జర్నలిస్టులకు, హోంగార్డులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా? అని ప్రశ్నించారు. రైల్వేలపై మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదన్నారు.


More Telugu News