వరుస లాభాలకు బ్రేక్.. భారీగా పతనమైన మార్కెట్లు
- 732 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 191 పాయింట్లు నష్టపోయిన నిఫ్టీ
- 2.74 శాతం కోల్పోయిన ఎల్ అండ్ టీ షేరు విలువ
దేశీయ స్టాక్ మార్కెట్లలో వరుస లాభాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు ఆ తర్వాత పెద్ద కుదుపుకు గురయ్యాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, ఎల్ అండ్ టీ వంటి హెవీ వెయిట్ కంపెనీలు ఈరోజు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. ఈ నేపథ్యంలో మార్కెట్లు నష్టాల్లోకి జారుకున్నాయి. ఒకానొక సమయంలో సెన్సెక్స్ 1,100కు పైగా పాయింట్లను నష్టపోయింది. అయితే చివర్లో సూచీలు కొంత కోలుకోవడంతో నష్టాలు కొంత వరకు తగ్గాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 732 పాయింట్ల నష్టంతో 73,878కి పడిపోయింది. నిఫ్టీ 191 పాయింట్లు పతనమై 22,456కి దిగజారింది.
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
బజాజ్ ఫైనాన్స్ (0.75%), బజాజ్ ఫిన్ సర్వ్ (0.69%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.21%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (0.18%), ఐసీఐసీఐ బ్యాంక్ (0.18%).
టాప్ లూజర్స్:
ఎల్ అండ్ టీ (-2.74%), మారుతి (-2.37%), నెస్లే ఇండియా (-2.22%), రిలయన్స్ (-2.17%), భారతి ఎయిర్ టెల్ (-2.03%).