ఏపీ, తెలంగాణ నుంచి పోటీ చేస్తున్న అత్యంత సంపన్న అభ్యర్థులు వీరే!
- తెలంగాణలో అత్యంత ధనిక అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రావు
- ఏపీలో రిచ్చెస్ట్ క్యాండిడేట్ పెమ్మసాని చంద్రశేఖర్
- విద్యార్థిగా అమెరికాకు వెళ్లి వేల కోట్లకు పడగలెత్తిన చంద్రశేఖర్
తెలంగాణలో లోక్ సభకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఏపీలో లోక్ సభతో పాటు అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తి అయింది. రెండు రాష్ట్రాల్లో వేల కోట్లకు అధిపతులతో పాటు సామాన్యులు కూడా బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో, రెండు రాష్ట్రాల్లో ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత శ్రీమంతులు ఎవరనేది తెలుసుకోవాలనే కుతూహలం అందరిలో ఉంటుంది. ఆ వివరాలు చూద్దాం.
తెలంగాణ విషయానికి వస్తే... ఎన్నికల్లో పోటీ చేస్తున్న అత్యంత రిచ్చెస్ట్ పర్సన్ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా బీజేపీ తరపున ఆయన పోటీ చేస్తున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తొలి డిప్యూటీ సీఎం కేవీ రంగారెడ్డి మనవడు విశ్వేశ్వర్ రెడ్డి. ఆయన తాతగారి పేరు మీదనే రంగారెడ్డి జిల్లా ఏర్పడింది. విశ్వేశ్వర్ రెడ్డి కుటుంబ ఆస్తుల విలువ రూ. 4,568 కోట్లు. ఈ మేరకు ఆయన అఫిడవిట్ లో చూపించారు. అపోలో హాస్పిటల్స్ వ్యవస్థాపకులు ప్రతాప్ సి రెడ్డి కూతురు సంగీతరెడ్డిని ఆయన పెళ్లాడారు.
ఏపీ విషయానికి వస్తే... గుంటూరు లోక్ సభ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అత్యంత ధనిక అభ్యర్థి. 2014లోనే ఆయన టీడీపీ తరపున నర్సరావుపేట లోక్ సభ టికెట్ కోసం ప్రయత్నించారు. అయితే 2014, 2019లో మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు ఉండటంతో ఆయనకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు గుంటూరు సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్ రాజకీయాల నుంచి విరామం తీసుకోవడంతో చంద్రశేఖర్ కు అవకాశం దక్కింది. చంద్రశేఖర్ కుటుంబ ఆస్తులు రూ. 5,705 కోట్లు. మన దేశంలో పోటీ చేస్తున్న అత్యంత ధనిక వ్యక్తుల్లో పెమ్మసాని చంద్రశేఖర్ ఒకరు.
ఇంటర్ వరకు తెలుగు మీడియంలో చదివిన చంద్రశేఖర్ కష్టపడి డాక్టర్ పట్టా తీసుకున్నారు. మెడిసిన్ పూర్తయిన తర్వాత ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. యూఎస్ లో 'యూ వరల్డ్ ఆన్ లైన్ ట్రైనింగ్' పేరుతో నర్సింగ్, న్యాయ, వాణిజ్య, అకౌంటింగ్ పరీక్షలకు శిక్షణ ఇచ్చే సంస్థను ప్రారంభించారు. బిజినెస్ మెన్ గా మారి అంచెలంచెలుగా ఎదుగుతూ వేల కోట్లు సంపాదించారు.