ఏపీలో పింఛన్ల పంపిణీ తీరుపై వైఎస్ షర్మిల ధ్వజం!
- పింఛన్ల పంపిణీ పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాడుతుందంటూ మండిపాటు
- ప్రతి నెలా ఇంత మందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అని ఆగ్రహం
- ప్రభుత్వ ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శ
ఏపీలో పింఛన్ల పంపిణీ కోసం వైసీపీ సర్కార్ అనుసరిస్తున్న విధానంపై ఏపీపీసీ ఛీఫ్ వైఎస్ షర్మిల మండిపడ్డారు. పింఛన్ల పంపిణీ పేరుతో వృద్ధుల ప్రాణాలతో జగన్ ప్రభుత్వం చెలగాటమాటమాడుతోందని దుయ్యబట్టారు. ప్రతి నెలా ఇంత మందిని చంపాలని లక్ష్యంగా పెట్టుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కడపలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.
షర్మిల ఇంకా మాట్లాడుతూ.. ఐఏఎస్ అధికారులు ప్రభుత్వానికి బానిసలుగా మారాల్సిన అవసరం ఏమిటి? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వానికి మేలు చేయాలని నెలనెలా ఇంత మందిని పొట్టన పెట్టుకుంటారా అని ఆమె ఫైర్ అయ్యారు.
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ ప్రభుత్వం మోసం
ప్రభుత్వ ఉద్యోగులను జగన్ ప్రభుత్వం మోసం చేసిందని షర్మిల మండిపడ్డారు. ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 22 వేల కోట్లు బకాయి పడిందన్నారు. 11వ పీఆర్‌సీ ప్రకారం ఉద్యోగులకు ఇవ్వాల్సిన ఐఆర్‌లో కూడా కోత పెట్టారని దుయ్యబట్టారు. 12వ పీఆర్‌సీ అమలు చేయాల్సిన ప్రభుత్వం.. 11వ పీఆర్‌సీలోనే కోతలు పెట్టిందని విమర్శించారు. చివరికి మెడికల్ బిల్లులను కూడా పెండింగ్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు.