చివరి బంతికి వికెట్ తీసిన భువనేశ్వర్ కుమార్.. కావ్యా మారన్ రియాక్షన్ వీడియో వైరల్
- రాజస్థాన్‌పై హైదరాబాద్ థ్రిల్లింగ్ విక్టరీ
- చివరి బంతికి వికెట్ తీసిన భువనేశ్వర్ కుమార్
- ఆనందం పట్టలేక చిన్నపిల్లలా ఎగిరి గంతేసిన కావ్య
కావ్యా మారన్.. ఐపీఎల్ ప్రేమికులకు పరిచయం అక్కర్లేని పేరిది. జట్టు మ్యాచ్‌ను కోల్పోయినా, గెలిచినా.. ఆమె నిత్యం వార్తల్లోనే ఉంటారు. తన హావభావాలతో ఇంటర్నెట్‌కు ఎక్కుతూ హాట్ టాపిక్‌గా మారుతుంటారు. తాజాగా, ఆమె మరోమారు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతున్నారు.
గతరాత్రి హైదరాబాద్‌లో రాజస్థాన్ రాయల్స్‌తో చివరి బంతి వరకు జరిగిన ఉత్కంఠ పోరులో ఎట్టకేలకు హైదరాబాద్ ఒక్క పరుగు తేడాతో విజయం సాధించింది. తొలుత రాజస్థాన్ వైపు మళ్లిన విజయం చివర్లో హైదరాబాద్‌కు చిక్కింది.
చివరి బంతికి రెండు పరుగులు అవసరమైన వేళ భువనేశ్వర్ కుమార్ వేసిన బంతిని పావెల్ బలంగా బాదేందుకు ప్రయత్నించి వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటి వరకు టెన్షన్‌తో కూర్చొన్న కావ్యా మారన్ ఆ బంతికి పావెల్ అవుట్ కాగానే చిన్నపిల్లలా ఎగిరి గంతేశారు. ఐపీఎల్ తన ఎక్స్ ఖాతాలో ఈ వీడియోను పంచుకుంది. ఎప్పటిలానే ఈ వీడియో కూడా వైరల్ అయింది. కావ్య ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. కాగా, ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 10 మ్యాచ్‌లు ఆడిన హైదరాబాద్ జట్టు ఆరింటిలో విజయం సాధించి 12 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉంది. 16 పాయింట్లతో రాజస్థాన్ రాయల్స్ అగ్రస్థానంలో ఉండగా, ఆరు పాయింట్లతో బెంగళూరు అట్టడుగున ఉంది.