హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత.. 50 కోట్ల రైడర్‌షిప్ దాటేసి సరికొత్త రికార్డు
- నిన్నటి వరకు మెట్రోలో ప్రయాణించిన 50 కోట్ల మంది
- నవంబర్ 2017లో ప్రారంభమైన హైదరాబాద్ మెట్రో
- పండుగలు, క్రికెట్ మ్యాచ్‌లు, ప్రత్యేక సందర్భంగా సర్వీసుల పొడిగింపు
- రోజుకు 5 లక్షల మంది రాకపోకలు
హైదరాబాద్ మెట్రో అరుదైన ఘనత సాధించింది. నిన్నటి వరకు మెట్రోలో 50 కోట్ల మంది ప్రయాణించారు. నవంబర్ 2017న ప్రారంభమైన మెట్రో రోజురోజుకు ఆదరణ చూరగొంటోంది. పండుగలు, ప్రత్యేక సందర్భాలు, ఐపీఎల్ మ్యాచ్‌లు వంటి సమయంలో అదనపు ట్రిప్పులు నడిపిస్తూ ప్రయాణికుల ఆదరాభిమానాలు చూరగొంటోంది. మెట్రోలో ప్రస్తుతం రోజుకు 5 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. అలాగే, ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త పథకాలు ప్రకటిస్తోంది.
గతరాత్రి ఉప్పల్ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా అర్ధరాత్రి దాటాక 12.15 గంటల వరకు మెట్రో తన సర్వీసులను పొడిగించింది. ఎన్జీఆర్ఐ, స్టేడియం, ఉప్పల్ స్టేషన్ల నుంచి ఈ రైళ్లు ప్రారంభమయ్యాయి. క్రికెట్ మ్యాచ్‌ల సందర్భంగా రౌండ్ ట్రిప్ టికెట్లను కూడా మెట్రో అందుబాటులోకి తెచ్చింది.