విషాదం.. 20 ఏళ్లకే కన్నుమూసిన యువ క్రికెటర్!
- ఇంగ్లండ్ యువ క్రికెటర్ జోష్ బేకర్ (20) ఆకస్మిక మృతి
- ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేసిన వోర్సెస్టర్‌షైర్ కౌంటీ
- 17 ఏళ్లకే ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన యువ ఆటగాడు
- లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ అయిన బేకర్ 22 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 43 వికెట్లు తీసిన వైనం
ఇంగ్లండ్ యువ క్రికెటర్ జోష్ బేకర్ (20) కన్నుమూశారు. ఈ విషయాన్ని అతను ప్రాతినిధ్యం వహిస్తున్న కౌంటీ జట్టు వోర్సెస్టర్‌షైర్ సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 2021లో 17 ఏళ్ల వయసులో అతడు ప్రొఫెషనల్ క్రికెటర్‌గా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తన ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో 22 మ్యాచులు ఆడిన ఈ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మొత్తం 43 వికెట్లు పడగొట్టాడు. బుధవారం వోర్సెస్టర్‌షైర్ తరఫున బరిలోకి దిగి మూడు వికెట్లు కూడా తీసిన బేకర్.. ఆకస్మికంగా మృతి చెందారు. కాగా, అతని మరణానికి గల కారణాన్ని మాత్రం వోర్సెస్టర్‌షైర్ వెల్లడించలేదు.
ఇక వోర్సెస్టర్‌షైర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ యాష్లే గైల్స్ ఈ సందర్భంగా ఒక ప్రకటన విడుదల చేశారు. "జోష్ తమకు సహచరుడి కంటే ఎక్కువ. అతను మా క్రికెట్ కుటుంబంలో అంతర్భాగం. మేం అందరం అతనిని చాలా మిస్ అవుతున్నాం. జోష్ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు మా ప్రేమ, ప్రార్థనలను అందజేస్తున్నాం" అని తన ప్రకటనలో పేర్కొన్నారు.