హీరోయిన్ గా ఖుష్బూ కూతురు ఎంట్రీ!

  • ఖుష్బూ పెద్దకూతురు పేరు అవంతిక 
  • లండన్ చదువు పూర్తి చేసిందన్న ఖుష్బూ 
  • నటన పట్ల ఆసక్తితో ఉందని వెల్లడి 
  • త్వరలోనే తన ఎంట్రీ ఉంటుందని వివరణ 

ఖుష్బూ .. తెలుగు తెరపై నిన్నటితరం అందాల కథానాయిక. ఆ తరువాత ఆమె తమిళ సినిమాలతోనే బిజీ అయ్యారు. తన గ్లామర్ తో అక్కడి ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నారు. ఆ తరువాత ఆమె తన వయసుకి తగిన ముఖ్యమైన పాత్రలను చేస్తూ వెళుతున్నారు. అలాగే సొంత బ్యానర్లో సినిమాలను నిర్మిస్తూ వెళుతున్నారు. అలా ఆమె బ్యానర్లో నిర్మితమైన 'బాక్' రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉన్నారు. 

తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కూతుళ్లను గురించి ప్రస్తావించారు. ఖుష్బూ - సుందర్ దంపతులకు అవంతిక - అనంతిక అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అవంతిక లండన్ లో తన చదువు పూర్తిచేసుకుని వచ్చింది. సోషల్ మీడియాలో ఆమె చాలా యాక్టివ్ గా ఉంటుంది. అందువలన ఖుష్బూ కూతురు అవంతిక .. యూత్ కి ముఖ పరిచయం ఉంది. 

  అవంతిక గురించి ఖుష్బూ ప్రస్తావిస్తూ .. "లండన్ లో తాను యాక్టింగ్ కోర్స్ పూర్తిచేసుకుని వచ్చింది. ప్రస్తుతం డాన్స్ నేర్చుకుంటోంది. త్వరలోనే తాను హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. సొంత బ్యానర్ ద్వారా పరిచయం చేసే ఆలోచన లేదు. ఎందుకంటే కొన్ని పరిస్థితులను .. అనుభవాలను ఫేస్ చేస్తూ వెళితేనే బాగుంటుంది. సపోర్ట్ చేయడానికి .. పడిపోతుంటే పట్టుకోవడానికి మేము ఉంటాము. కానీ తన ప్రయాణానికి అవసరమైన పాఠాలను తాను నేర్చుకుంటేనే బాగుంటుంది" అని చెప్పారు. 


More Telugu News