మండుతున్న ఎండలు... ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్ ఏర్పాటు చేసిన పుదుచ్చేరి

  • ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనదారులు ఎండవేడితో ఇబ్బందిపడకుండా గ్రీన్ నెట్స్ ఏర్పాటు
  • రద్దీగా ఉండే ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసిన పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్
  • నెట్టింట వైరల్‌గా మారిన గ్రీన్ నెట్స్
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. అధిక ఉష్ణోగ్రతల కారణంగా చాలా ప్రాంతాలు నిప్పుల కొలిమిని తలపిస్తున్నాయి. చాలా ప్రాంతాల్లో ఏప్రిల్ నెలలోనే ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలు దాటాయి. ఈ నేపథ్యంలో బయటకు వెళ్లడానికే జనాలు భయపడుతున్నారు. ఉద్యోగ, ఉపాధి, ఇతర అవసరాల నిమిత్తం నగరాల్లో బయటకు వెళ్లే వారు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద కనీసం అర నిమిషం నుంచి రెండు నిమిషాల వరకు వేచి చూడాల్సిన పరిస్థితులు ఉంటాయి.

ఎండలు మండిపోతుండటంతో ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వేచి చూసే వాహనదారులు వేడితో ఇబ్బందిపడకుండా పుదుచ్చేరి పబ్లిక్ వర్క్స్ డిపార్టుమెంట్ సరికొత్త ఆలోచన చేసింది. రద్దీగా ఉండే పలు ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద గ్రీన్ నెట్స్‌ను ఏర్పాటు చేసింది. ఇందుకు సంబంధించిన వీడియోను పలువురు నెట్టింట షేర్ చేశారు.


More Telugu News