బీఆర్ఎస్‌కు ఒక్కసీటు రావడమూ కష్టమే: ఉత్తమ్ కుమార్ రెడ్డి

  • బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని విమర్శ
  • కేంద్రంలో ఆ పార్టీకి మరోసారి అవకాశమిస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని హెచ్చరిక
  • రిజర్వేషన్ల పరిరక్షణ, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని విజ్ఞప్తి
లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ఒక్క సీటు రావడం కూడా కష్టమేనని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా మోతెలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో అయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీజేపీ మతాన్ని అడ్డు పెట్టుకొని రాజకీయాలు చేస్తోందని ఆయన విమర్శించారు.

కేంద్రంలో ఆ పార్టీకి మరోసారి అవకాశమిస్తే రిజర్వేషన్లకు తూట్లు పడతాయని హెచ్చరించారు. రిజర్వేషన్ల పరిరక్షణ, అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటున్న భారతీయుల మధ్య బీజేపీ చిచ్చు పెడుతోందని ఆరోపించారు.

రేవంత్ రెడ్డిని కలిసిన ఇంద్రకరణ్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కలిశారు. ఈ కార్యక్రమంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నేత చిన్నారెడ్డి తదితరులు ఉన్నారు.


More Telugu News