నాన్న గారు అన్ స్టాపబుల్: హిందూపురంలో నారా బ్రాహ్మణి
- హిందూపురంలో మహిళలతో నారా బ్రాహ్మణి సమావేశం
- హిందూపురంను బాలకృష్ణ గారు పుట్టిన గడ్డలా భావిస్తారని వెల్లడి
- ఒక మోడల్ నియోజకవర్గంగా హిందూపురంను నిలపాలన్నది ఆయన కల అని వివరణ
టాలీవుడ్ అగ్రకథానాయకుడు, టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ప్రాతినిధ్యం వహిస్తున్న హిందూపురం నియోజకవర్గంలో ఆయన కుమార్తె నారా బ్రాహ్మణి మహిళలతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. ఈ స్త్రీ శక్తి కార్యక్రమంలో తాను పాల్గొన్న వీడియోను నారా బ్రాహ్మణి సోషల్ మీడియాలో పంచుకున్నారు.
నాన్న గారు సినీ, రాజకీయ రంగాల్లో అన్ స్టాపబుల్ అని కొనియాడారు. హిందూపురంను తను పుట్టినగడ్డలా భావిస్తారని వెల్లడించారు. హిందూపురంను అభివృద్ధిలో దేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా నిలపాలన్న ఆశయంతో బాలకృష్ణ గారు పనిచేస్తున్నారని బ్రాహ్మణి వివరించారు. హిందూపురం టీడీపీకి కంచుకోట అని అభివర్ణించారు.
నియోజకవర్గంలో పరిశుభ్రత కోసం అండర్ డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటు, మహిళలకు ఉపాధి కోసం గార్మెంట్స్ పరిశ్రమల స్థాపన, హంద్రీనీవా నీళ్లను చిలమత్తూరు మండలానికి తీసుకురావడం, చేనేత పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాల్సి ఉందని బాలకృష్ణ గారు పరితపిస్తుంటారని నారా బ్రాహ్మణి పేర్కొన్నారు. నాన్న గారు సినీ, రాజకీయ రంగాల్లోనే కాకుండా సేవా రంగంలోనూ ముందున్నారని కొనియాడారు.